mee ishtam. enthaina sampaadinchandi

massiveptr.com

Monday 6 June 2011

తీరని కోరిక చాలా సం. కు తీరిన వేళ

ఇది జరిగిపోయిన సంగతి. కాని మదిలో నిలిచిపాయింది.
       నాకు పాటలు అంటే చాలా పిచ్చి.చిన్నప్పటినుండి కూడా నేను  పాటల పోటీలో ఎప్పుడూ ఫస్టే.   నాన్న నాకు నేర్పించేవారు. పెళ్లి జరగక ముందు రేడియో లో వివిధ భారతి, మంచాహే గీత్ వింటూ వుండేదాన్ని. పెళ్లి జరిగాక అన్నీ బంద్. నా బిడియం వల్ల కావొచ్చు, లేదా టి.వి.వల్ల కావొచ్చు, ఉమ్మడి కుటుంబం వల్ల  కావొచ్చు, నా కోరికలు 16 స.వరకు తీరలేదు.నాకు సంగీతం రాదు. కాని  సంగీతం వచ్చిన వాడు మూగవాడైన పరిస్థితి నాది. ఆ బాధ నాకే తెలుసు. గొంతు విప్పి పెద్దగ పాడుకోవాలని ఇష్టం. ఆరుబయట నా ఇష్టంగా పాడుకోవాలని ఇష్టం. కాని ఏం చేయను. అద్దె ఇల్లు. ఇరుకు ఇల్లు. 
   ముందు నాకు తోడుగా మానాన్న పాడేవారు. కాని నా పెళ్లి కి ముందు చనిపోయారు. ఘంటసాల పాటలు ఉన్నంత వరకు నా మదిలో మా నాన్న కూడా అలాగే వుంటారు. అలాగే పాడేవారు. నాలో ఎవరితోనైనా కలిసి పాడాలనే  కోరిక అలాగే వుండిపాయింది.
   ఒక రోజు నేను రిసెప్షన్ కి వెళ్ళాను. అక్కడ అందరూ ఏదో ఒకటి తప్పకుండ ప్రదర్శించాలి అని పట్టుబట్టారు. నేను అందరికంటే చివర్లో కూర్చొని చూస్తున్నాను. ఏజ్  తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా.  నా లైన్ వస్తుంది. కాళ్ళు  వణుకుతున్నై. అంతలోనే ఆపేసారు. ఎవరో అమెరికా  అతిధి వస్తున్నారని. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. హమ్మయ్య  ఆగిపాయింది అనుకున్నాను. మామూలు మనిషినయ్యాను. 
   అంతలో ఆ వచ్చిన అతిధి కొన్ని కొత్త పాటలు పాడారు. నాకూ అవి రావు. ఇంతలో మైక్ పట్టుకొని "నాతొ సమానంగా ఎవరైన పాడేవాళ్ళు నాతొ జాయిన్ రావొచ్చు . ఒక్కడిని పాడితే బాగుండదు.ఎవరైన లేడీ రండి" అంటూ పాట బిగిన్ చేయబోయాడు. వెళ్లి పోదామనుకున్న దాన్నికాస్తా  ఆగిపోయాను. నాకు ఏదో తెలియని ఉత్సాహం వచ్చేసింది. ఏం పాటో అనుకున్నాను. దేవుడా నాకు తెలిసిన పాట ఐతే బాగుండు అనుకున్నాను. మళ్ళీ గుండె స్పీడ్ గా కొట్టుకుంటుంది. 16 స. తర్వాత కదా. కాళ్ళు మళ్ళీ వణుకుతున్నై. పాడాలనే కోరిక ఒక్కసారిగా బయటికి వచ్చింది.
        మ్యూజిక్ వినగానే నాకు తెలిసింది అది నాకు వచ్చే పాటే. "నన్ను దోచుకొందువటే" అని. ఇక వెనుక లైన్ నుండి నేను నడవలేదు. మీకు తెలుసు ముందుకు పరుగెత్తుకొని వచ్చానని. నా మనసు లోని కోరిక పురివిప్పింది. మనసుతీర అతనితో కలిసి పాడాను. ఇంకా ౩ పాటలు కూడా. అందరూ ఒకటే చప్పట్లు. అపార్ట్ మెంట్ వాళ్ళు పైన లైన్ కట్టి చూస్తున్నారు. చుట్టాలు అందరికీ సంతోషం. ఇన్ని రోజులు ఎక్కడ దాచావే నీ గానాన్ని అని.  మా వారు నివ్వెర పోయారు. ఏంటిరా మీ ఆవిడ ఇంత బాగా పాడుతుంటే ఎన్నడైనా చెప్పలేదు" అని ఎవరో అంటుంటే  "నాకూ ఇప్పుడే తెలుసు మామా " అంటున్నారు. 
 మా అత్తగారు. ఆడపడుచులు చాలా సంతోషపడ్డారు. పాడుతా తీయగా వెళ్ళు అన్నారు. కాని ఏజ్ చాలా వుంది వద్దు అన్నాను. 
 అలా నా కోరిక తీరింది. మర్చిపోలేను.







 






2 comments:

  1. ఎంత పని చేసారండీ. పాడగలిగే అదృష్టం వుంది కూడా ఇంత కాలం పాడకపోవడం మీ తప్పే. నేనే మీ వారి స్థానం లో వుంటే ఇంత కాలం చెప్పనందుకు చాలా బాధ పడి వుండేదాన్ని. సర్లెండి. ఇప్పటికైనా ధైర్యం చేసారు. బాగా కోప్పడాలని వుంది. ఏమీ అనుకోకండి. కొంచెం ఆవేశం వచ్చింది మీరు రాసింది చదవగానే. ఆల్ ది బెస్ట్.

    ReplyDelete