mee ishtam. enthaina sampaadinchandi

massiveptr.com

Sunday 24 April 2011

"నన్ను ఎందుకు కన్నావు అమ్మా?............"

         కంగారు పడకండి  అమ్మా.... తరువాత ఎండా కాలం సెలవుల్లో అని రాయాలి. అవును మా అమ్మాయి బర్త్ డే ఈ రోజు (ఏప్రిల్ 24 ). నిన్న సెకండ్ శో మిస్టర్ పర్ఫెక్ట్  వెళ్ళాము. కరక్ట్ గా 12 .౦౦.కి  విషెస్ చెప్పాము. oh ఒకటే ఆనందం. 
                 పిల్లలు బర్త్ డే అనగానే 1  సం.ముందునుండే దాని గురించి  ఆలోచిస్తారు. ఏమేం కొనుక్కోవాలి ఎలా తయారవ్వాలి, ఫంక్షన్ ఎట్లా జరుపుకోవాలి అని. నేను పెద్ద ఆర్భాటంగా ఏం చేయను. సింపుల్ గా నే చేస్తాను. పులిహోర,స్వీట్స్ , రెండు కూల్ డ్రింక్స్ బాటిల్స్  తను ఎంతమంది ఫ్రెండ్స్ ను పిలిస్తే అంతమందికి రడీ చేస్తాను. తర్వాత కేక్ షరా మామూలే కదా.
     కాని తిరకాసు ఎక్కడంటే  తను సెలవుల్లో పుట్టింది అదీ  కరక్ట్ గా  లాస్ట్ వర్కింగ్ డే కు తర్వాత. స్కూల్ తెరుస్తారు అనే ఆశ ఏ మాత్రం లేదు.ఏమీ తెల్వని రుజుల్ల్లో ఇంటిపక్కవాళ్ళతో కలిసి జరిపించేదాన్ని. తర్వాత నేను స్చూల్లో పంచుతాను  అనేసరికి కంగారు. సెలవులు కదా ఎలాగా అని. చాక్లెట్స్ పంచాలి కాబట్టి  విధి లేక 15 రోజుల  ముందే కొత్తబట్టలు వేసి చాక్లెట్స్ తో పంపించే దాన్ని.ఇంటివరకు తర్వాత చేసేదాన్ని. 
        ఇప్పుడు మాత్రం "నన్ను సెలవుల్లో ఎందుకు కన్నావు అమ్మా"అని అడుగుతుంది.  ఏం చెప్పాలి దానికి. 
"నా డేట్ కి ఏ స్పెషల్ కూడా లేదు" అని అంటుంటే ఎట్లాగో దొరికాడు సచిన్అతని బర్త్ డే ఇదేరోజు అని చెప్పాను. ఇక అప్పటి నుండి అందరికీ చెప్పడం "నాది, సచిన్ ది సేం  డే" అని. 
అప్పటి నుండి T .V లో సచిన్ కేక్ కోస్తుంటే ఇక్కడ ఈమె కేక్ కోయడం. సరదాగా గడిచి పోతుంది. దానికి సంతోషం ఆగాడు. ఫ్రెండ్స్ కి చూపిస్తుంది. థాంక్స్ సచిన్. కాని ఈరోజు సత్య సాయిబాబా చనిపోవడం చాలా బాధాకరం. ఐన సరే దాని కోసం ఫంక్షన్ చేద్దామనుకున్నా. కాని T .V. లో విజువల్స్ చూసి తను బర్త్ డే చేసుకోను అన్నది. నాకు కూడా ఆయన చనిపోవడం బాధ అయి వద్దనుకుంటున్నాను.
కాబట్టి ఇప్పటి  జనరేషన్ కు  చెప్పేది  ఏంటంటే  సెలవుల్లో  కనకండి.  లేదా ఆ  డేట్  కి  ఎదైనా  స్పెషల్  ఉందా కనుక్కోండి. లేకుంటే పిల్లలకి సమాధానం చెప్పలేము. ఓకే  బై .







Thursday 21 April 2011

"ఇంటర్ మార్క్స్ "(బాబోయ్ )

          వెబ్ సైట్ రెడీ గ వుంచాను. మా అమ్మాయి రిజల్ట్స్ కోసం. కరక్ట్ టైంకి ఓపెన్ చేసాను. చాలా  టెన్షన్తో. 444 /470 . ఇంకేముంది ఒకటే ఏడుపు. 455  రావాలట. ఆ మార్క్స్ చాల్లే అన్నా కూడా  ఇప్పుడు తక్కువ వస్తే ఎంసెట్ లో రాంక్ రాదమ్మా అంటూ ఏడుపు. ఫిసిక్స్ చాలా హార్డ్ గా వచ్చిందట. ఇంప్రూవ్ మెంట్ రాయమన్నాను. గంట తర్వాత  రూం నుండి బయటకు వచ్చింది. 
ఫ్రెండ్స్ కో ఫోన్ చేస్తే ఛాలా వరకు అందరికి దీనికంటే తక్కువ వచ్చాయి. ఎందుకు వాళ్ళ కి తక్కువ వచ్చాయమ్మా వాళ్ళు బాగా చదువుతారు  అంటది. నాకేమీ తెలుసురా అన్నాను. 
అందరు కంగ్రాట్స్ చెప్తుంటే కాస్త  తేరుకుంది. భగవంతునికి థాంక్స్ చెప్పుకున్నాము. సాయంత్రంగుడికి వెళ్ళాలి. 
ఇప్పుడే తన కోర్కెల చిట్టా విప్పుతుంది. వాచ్(ఇంకొకటి), గొలుసు( వేరేదీ ), డ్రెస్సు (ఇంకా, ఇంకా).......
హమ్మో పారిపోతున్నాను బాబోయ్.


 

Tuesday 19 April 2011

దేవుడికి అంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు?

            అవును వేలు, కోట్లు వున్నవారు డబ్బులు దేవుడి హుండీ లో ఎందుకు వేసేది? అంత డబ్బు వున్నవారు మామూలుగా చాల విద్యావంతులై  కూడా వుంటారు.పోనీ ఆ డబ్బులు కూడా ఎవరికైనా సహాయ పడుతున్నాయా  అంటే అదీ తెలీదు. మధ్యలో మింగే వారు ఎందఱో!  "మానవ సేవే మాధవ సేవ" అని మన అందరికీ తెలుసు. 
కొంత మాత్రము దేవుడికి సమర్పించి మిగిలిన డబ్బు తో ఎందరికో జీవనోపాధిని కల్పించవచ్చు. కొన్ని కుటుంబాలకు ఆసరాగా ఉండొచ్చు. నిజాన్ని మీరే తెలుసుకొని వారికి సహాయాన్ని అందించండి. ఒక సంస్థను మీరే నడిపించి చాల మందికి  జీవనోపాధిని కల్పించి, చదువుకొని ఉద్యోగం లేని వారికి పనిని కల్పించండి. వారు మిమ్మల్ని రోజూ దేవునికంటే ఎక్కువగా తలచుకుంటారు. దేవులు మిమ్మల్ని చూసుకుంటారు. 
పేపర్లలో కిలోల కొద్దీ బంగారాన్నీ , కోట్లకొద్దీ డబ్బును సమర్పించే వారి గురించి చూసి  ఇది వ్రాస్తున్నాను. డబ్బు సార్ధకం యితేనే దానికి మంచి విలువ. పోనీ మీకు సంస్థను నడిపించే వీలు లేకపోతె, మంచిగా నడిచే సంస్థ ను గురించి తెలుసుకొని వారికి సహాయ కారులుగా వుండండి. దాన్ని ఇంకా వృద్ది చేయించండి. మినిమం సహాయం ఏంటంటే ఒక కుటుంబాన్ని ఏదైనా  ఒక మిషిన్ పోషించడానికి తోడ్పడుతుంది కదా . అవి కొని పంచండి. స్థోమత కొద్దీ ఇవ్వండి. ఎందఱో నోటికి అన్నం దొరుకుతుంది. సగం కడుపు నిండడానికైనా వస్తుంది కదా.
       రిటైర్ ఐన వారిని, బాధ్యతలు తీరి వూరికే ఇంట్లో వుండే మధ్య వయస్కులను, సహాయకారులు గా వుండే టీనేజ్ పిల్లలను, సలహాలను ఇచ్చే వారిని వినియోగించుకోవచ్చు. కాని స్వలాభాన్ని ఆశించి మాత్రం సహాయం చేయకండి. అందరికీ ఏదో ఒక వ్యపకాన్ని  కల్పించడం ద్వారా ఇంట్లో తగాదాలను కూడా నివారించవచ్చు. నష్టాలలోవున్న మంచి సంస్థ లకు ప్రాణం పోయండి. పని చేయడం వల్ల ప్రతిఫలం వచ్చేటట్టు చేయండి. మేధావుల సహాయం తీసుకోండి. 
           దేవుడి కి సమర్పించే డబ్బు ఏమాత్రం   వినియోగం కాకపోవడం మనం చాలా చూస్తున్నాము ఈ మధ్య పేపర్లలో కదా. వృధా కాని సహాయాన్ని మీదబ్బుతో మీరే అందించండి. మానవాళి అభివృద్దికి తోడ్పడండి. మనవ విలువలను కాపాడే బాధ్యత అందరిపైనా  వుంది. 
          ముందు తరాలవారిని దృష్టిలోపెట్టుకొని మనం మంచిగా నడచుకోవాలి. వారికి మంచి భవిష్యత్తును, మనవవిలువలను  బహుమతులు గా  అందించాలి. భవిష్యత్తు ఇప్పటికే అగమ్య గోచరంగా కన్పిస్తుంది. దాన్ని మనం కొంచమైన నివారించడానికి, మన ప్రయత్నం మనం కొంత అయినా  చేయాలి కదా. కాస్త  ఆలోచిస్తారు కదా.
  

"మా నాన్న బాగా గుర్తుకొస్తున్నారు"

             ఎందుకో మా నాన్న ఈ రోజు బాగా గుర్తుకు వస్తున్నారు. మా నాన్నను  (చిట్యాల  పంతంగి లక్ష్మి కాంతా రావు) నల్గొండ ఘంటసాల అనేవారట. మా నాన్న ఫ్రెండ్స్  చెప్పారు. నాన్న చాల బాగా పాడేవారు. బుల్బుల్, ఫ్లూట్ చాలా బాగా వాయించేవారు. " శిలలపై శిల్పాలు చెక్కినారు " పాడుతుంటే అబ్బ చెప్పలేను. ఇప్పడు కూడా  సాంగ్ వింటుంటే (తలచుకున్నా  కూడా) నాకు కళ్ళ నీళ్లు ఆగవు.'
సంగీతం నేర్చుకోలేదు. ఐన కూడా స్వరాలూ చాలా బాగా పలికేవారు..
ఆయన రచయిత కూడాను.అప్పట్లో  "ప్రజామత" లో ప్రింట్ అయ్యాయి. ఇంక చాల సరదాగా మాట్లాడేవారు. చుట్టూ 10 మంది ఖచ్చితంగా ఉండాల్సిందే. అందరి ముఖాల్లోనూ చిరునవ్వే. అంతగా నవ్వించేవారు. నేను నాన్న పోలిక మాత్రమే. సరదాతనం రాలేదు. అదే నాకు చాలా బాధగా వుంటది. "నీలా నేను ఎందుకు లేను నాన్న" అంటే. "నీకు వుండే ఒపికతనం  నాకు వోచ్చిన్దారా? దేవుడు ఎలా పుట్టించారో అలా మనం వుండాల్సిందే. మార్చలేమురా " అనేవారు.
గాయనీ గాయకుల గురించీ, వారు పాడే విధానం గురించీ చెప్పేవారు. చాల చిన్నతనం లోనే నాకు  హిందీ ఆర్టిస్ట్ ల పేర్లు అందరివీ వచ్చు. ఇప్పుడు పాత హిందీ పాటలు వింటుంటే నాన్న బాగా గుర్తుకు వస్తారు. యాభై మూడవ ఏటనే చనిపోయారు. నాన్న అమ్మకు రాసిన ఉత్తరాలలో ఎంత ప్రేమ కన్పిస్తుందో. ఇప్పటికీ మా అమ్మ వాటిని చాల భద్రంగా దాచుకుంది. నాన్న చనిపోయాక ( 53 వ ఏట 1992 లో)  మాకు చూపించింది.
భోగి రోజు మల్లెపూవులాంటి లాల్చీ పైజమా తో అందరికి రాత్రి గుళ్ళో కనబడి,  తెల్లారి 6 గంటలకు చనిపోవడం అందరినీ  చాలా బాధించింది.

నాన్న తలుపు ఆధారంగా చేసుకొని మ్యూజిక్ వేసేవారు. అది ఏ పాటో నేను తక్కువ టైం లో చెప్పాలి. అలా నేను చెప్పగానే ఎంత సంతోషించేవారో. నాకు సుశీల పాటలు చాలా వచ్చు. నా న్న నేర్పించారు. " ఆకులో ఆకునై"అనే పాట నాకు చాలా ప్రైజ్ లను తెచ్చిపెట్టింది. నాన్న, నేను కలిసి పోటీ పడి పాడేవారం ఇంట్లో మరియు ఫంక్షన్లలో.
విజయశాంతి ఆక్టర్ ని చాల ఇష్టపడేవారు. తన birthday (జూన్), అమెది కూడా అదే రోజు అనుకుంటాను. లేదా 24 డేట్ అనుకుంట ఏదో మరి ఇద్దరిది ఒకటే. 
తాతయ్య  గార్వం (అమ్మమ్మ భర్త )నాకు లేదు. మా పిల్లలకు లేదు. అది కూడా నాకు బాధ. ఇప్పుడు నాన్న ఏజ్ వాళ్ళను చూస్తుంటే నాన్న ఇంకా వుంటే బాగుండేది అన్పిస్తుంది. మా చిన్న అమ్మాయి మా నాన్న పోలిక. మా వారు దాన్ని "మామగారు" అంటారు సరదాగా.
  
నేను ఇప్పుడు నాన్న, మా అక్క, నేను చదివిన డిగ్రీ కాలేజ్ లోనే job చేస్తున్నాను. మా నాన్న తిరిగిన,చదివిన, పాడిన కాలేజ్." ఈ గాలి ఈ నెల అని రోజూ అనుకుంటూ వెళ్తాను". అమెరికాలో వున్న వారు చాలా ఏండ్ల కు ఇండియా వచ్చినంత ఫీలింగ్ రోజూ కూడా నాకు. 
ముద్దపప్పు బొగ్గుల పొయ్యి మీద చెయ్యడం, నీళ్ళ  చారు, వంకాయ కూర ఇంకా సొరకాయ, బీరకాయ, వంకాయ నిప్పుల్లో వేసి కాల్చుకొని నెయ్యి తో , చింతకాయ పచ్చడిలో వేసుకొని తినడం నాన్నకు చాలా ఇష్టం. ఆ పనులు నేను చేసేదాన్ని. నన్ను చిన్నోడు చిన్నోడు అని పిల్చేవారు. 

"మీ అమ్మను కుర్చీల మధ్యలో నుండి చూపించారురా. నేను కూర్చొని ఉందేమో అనుకున్నాను. కానీ నిలబడి వుందట. నేను అలా మోసపోయాను"  అని నవ్వించేవారు. పెళ్లి చూపులు అయ్యాక ఒక సంవత్సరానికి చేసుకున్నారట పెళ్లి ఆ రోజుల్లో. అంత ప్రేమ మా అమ్మ అంటే నాన్నకు. అమ్మ కుర్చీలో కూర్చుంటే కాళ్ళు నెలకు అందవు వేలాడుతుంటాయి. . కాస్త పొట్టి. "మీ అమ్మ కాళ్ళ ను చాలా ఈజీ గా  దులుపు కోవచ్చురా." అనేవారు. ఇంకా ఎన్ని జ్ఞాపకాలో.




Tuesday 12 April 2011

బ్లౌజ్ కుట్టడం నేర్చుకోండి ఇలా

                 బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ. కాస్తంత  క్రియేటివిటీ  వుండాలి. కాస్త ఓపిక వుండాలి. చీర కొన్నప్పుడల్లా బ్లౌజ్ కు ఖర్చు పెట్టాలంటే హమ్మో అని కాస్త బాధ. నాకే కనుక స్టిచ్చింగ్  వచ్చుంటే ఈ 200 రూపాయలు మిగిలేవి కదా అనుకుంటాను. కానీ మళ్లి టైలర్ దగ్గరికి వెళ్ళడం 200 సమర్పయామి. బ్లౌజ్ ఒక్కటి ఎవరైనా  నేర్పిస్తే 1000 రూపాయలు (అది కూడా అన్నిటి కంటే చివరికి నేర్పిస్తారు.) మిషిన్ అనవసరంగా వుండడం చాలా ఇండ్లల్లో చూసాను. దానిలో కాస్త ఆయిల్ పోసి చాల జాగ్రత్తగా వాడండి. కొందరికి అదే జీవనోపాధి.
            ఒకరి ఇంట్లో ఎంబ్రాయిడరీ   వాడకం లేక తుప్పుపట్టడం చూసి నాకు ఎలాగో అన్పించింది.   సరే ఇక ఎలా కుట్టాలో చిన్న కిటుకు మాత్రమే ఇది. మిషిన్ ఉన్నవారికి మాత్రమే. చెప్పాక ఛీ ఇలాన అనుకోకండి. కాస్త ఆలోచించండి అంతే. చాల మంది ఉన్న ఇంట్లో ఇలా అవసరమే కదా. ఒక్క బ్లౌజ్  మాత్రమే కాదు. ఏవైనా కూడాను.
          చాలా బాగా కుదిరిన ఒక పాత బ్లౌజ్ యొక్క కుట్లు అన్ని ఓపికగా తీసివేసి, బాగా దులిపి, ఒకసారి స్టార్చ్ పెట్టి అన్నీ ఆంటే రెండు చేతులు, ముందు వెనుక భాగాలు, జాయింట్ చేసే ముక్కలు విడి విడిగా ఆరవేసిన తర్వాత ఐరన్
చేసి పెట్టుకోవాలి.
         కాస్త ఓపిక గా ఒక పేపర్ మీద వేసి  అదేవిధంగా కట్ చేసుకొని దాన్ని భద్రంగా దాచిపెట్టుకోవాలి. ముందు ముందు ఉపయోగించుకోవచ్చు. మీరు కుట్టుకోవలనుకొనే బ్లౌజ్ పీస్ మీద పెట్టి చాల జాగ్రత్తగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. 
1 లేదా 2  చెడిపోవచ్చు. కానీ ౩ వది  కుదురుతుంది కదా. సిటీ లలో స్టిచింగ్ చ్చార్జేస్ ఎక్కువ. సో కాస్త ఓపిక, కాస్త 
క్రియేటివిటీ వుండాలి అంతే. ప్రయత్నం చేయండి.

Sunday 10 April 2011

అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు.

అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు.అందరు మా వూరికి (నల్గొండ) కు తప్పకుండా రండి.కళ్యాణం చాలా చాలా బాగా జరుగుతుంది.గుళ్ళోనే  అందరమూ భోజనాలు చెయ్యాలి. ఇబ్బంది ఏమీ వుండదు. రాత్రి కూడా ఇక్కడ ఉండేటట్లు చూసుకోండి. బాండు  మేళం వాళ్ళు ఎంత మంచి పాటలు మనకు అందిస్తారంటే అది మన గుండెలను తాకుతుంటే కళ్ళనుండి నీళ్ళు  కారుతాయి. మనసెరిగిన వాడు  మా దేవుడు, సీతారాముల కళ్యాణం చూతము రారండి,
అని ఇంకా ఛాలా పాటలు వింటుంటే  ఆ ఆనందం చెప్పలేనిది. ఈసారీ వాతావరణం కూడా చల్లగా ఆహ్లాదంగా వుంది. సో అందరు తప్పక రండి.  ఇది నా ఫస్ట్ పోస్ట్. తప్పులుంటే క్షమించండి. దీన్ని మోడిఫై  ఎలా చేయాలో నాకు తెలవట్లేదు. ముందు ముందు ట్రై చేస్తాను. బై