mee ishtam. enthaina sampaadinchandi

massiveptr.com

Friday, 30 December 2011

****ఇంతలా**** నేను ****ఎప్పుడూ****వణకలేదు.****(మీకు చదివే ఓపిక ఉందా? అని టెస్ట్ కూడా )

మా ఆయన తరఫు వారి పెళ్లి.
ఆయన తరఫైతే ఆఫీస్ లీవ్ ఈసీగా దొరుకుతుంది. నా తరఫైతే మాత్రం  అస్సలు దొరకదు. కాంపులు  అంటారు.  అస్సలు వెళ్లొద్దు  పెళ్ళికి. నా పుట్టింటి తరఫున ఏదైనా ఫంక్షన్ ఐతే నీవు వెళ్ళు అంటారు. అదే ఆయన తరపున ఐతే వెళ్దాం. వెళ్తే  మాట దక్కుతుంది అంటారు. వారి తరపున కదా. ఈసారి నేను చాలా పట్టుదల గా వున్నాను వెళ్ళవద్దని.   ఎలాగైనా సరే నేనే నెగ్గాలి. నేను పోనంటే పోను అని నిర్ణయించుకున్నాను.

           స్కూల్ నుండి వస్తూ టైలర్ దగ్గరినుండి చీర తెచ్చింది నా కూతురు. హబ్బ ఎంత బాగుందో. పాచ్ వర్క్. క్రీం కలర్ కి మెరూన్ కలర్ బార్డర్. చాల బాగుంది. ఎప్పుడు కట్టుకోవాలో అని కాలండర్ చూస్తున్నాను............మా వారు ఇంట్లోనే వున్నారు. నన్ను బతిమిలాడడానికి రడీ అవుతున్నారు రమ్మని.
"ఈ సారికి రా చిన్నీ. పెళ్ళిలో అందరూ నిన్ను అడుగుతారు. బాగుండదు. "

" మరి  నావాళ్ళు  నన్ను  అడగలేదా . ఒక్కదానివే  వచ్చావేన్ది?  బస్ చార్జీలు  మిగులుతాయి అనా అని నన్ను అంటుంటే నాకు ఎంత సిగ్గేసింది. ఎప్పుడూ మీకేనా పట్టింపులు నాకూ వుంటాయి, అయినా  నాకు కొత్త చీర కూడాలేదు కట్టుకోవడానికి నేను రాను. "

"అమ్మా  ఇందాకే కదనే నేను షాప్ నుండి కొత్త చీర తెచ్చాను. అది కట్టుకో" అని చిన్నది గట్టిగా అరిచింది.

"హబ్బా హత  విధీ నిన్ను ఎవరు చెప్పమన్నారే? కాస్త నోరు మూసుకోలేవా? వెళ్ళు బయటికి."
"అమ్మ 4 రమువేల్దామే. ఇంతవరకూ కలిసి 4 రము ఎప్పుడూ వెళ్ళలేదు."

"అవును చిన్నీ. మీ తరపున ఫంక్షన్ ఐతే నేను కూడా వస్తాను. పిల్లలు చూడు ఎట్లా  చూస్తున్నారో"
"మిమ్మల్ని అస్సలే నమ్మను. ఎన్నోసార్లు ఇలాగే అన్నారు. పిల్లలకోసం అయితేనే nenu  ఒప్పుకుంటున్నాను." నా రోషం  అంతా దిగిపాయింది. పెద్ద బాగ్లు 2 సదిరాను. మూడు రోజులకి.

బస్ లో పక్క పక్క సీట్లు. విండో లు రెండూ పిల్లలకి. మధ్యలో మేము. ముందు సీట్లు. 3  ,4 ,5 ,6 . బస్ వెళ్తుంది. రోడ్డును గమనించడం నాకు చాలా ఇష్టం. డ్రైవింగ్ ను గమనిస్తుంటాను. ముందు సీట్ కోసం రిక్వెస్ట్ చేస్తాను ఎక్కువగా.

పిల్లలు ఒకరు ఐపాడ్ వింటూ , ఒకరు నాన్నతో ముచ్చట్లు. అలా అలా వెళ్తుంది బస్. నేను ఒకసారి కునుకు, ఒకసారి రోడ్డు ఇంకా  పిల్లలను గమనిస్తున్నాను.నిద్ర వస్తుంది.


పిల్లలు కూడా చిన్నగా నిద్రలోకి జారుకున్నారు. నాన్ స్టాప్ బస్. చాలా కాం గా  వుంది. హై వే. మధ్య మధ్య లో మాకు పెళ్లి నుండి ఫోన్ లు బయలుదేరారా? అని
నేను కూడా కళ్ళు తెరుస్తూ, మూస్తూ, రోడ్డును, డ్రైవింగ్ ను గమనిస్తూ ఉంటున్నాను. డ్రైవింగ్ ను గమనించడం నాకు ఇష్టం. అట్లా నేను కూడా నిద్రలోకి జారిపోయాను. డ్రైవర్  హరన్ కొట్టడం తో  మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి పిల్లలను చూసాను. నిద్రలో వున్నారు.

మావారిని చూసాను. అంతే ఒక్కసారే వణుకు వచ్చింది నాకు. నోట్లో నుండి మాట రావడం లేదు. అరుద్దామంటే గొంతు పెగలట్లేదు. మావారు ఎటో చూస్తున్నారు. ఆ చూపులో జీవం లేదు.  నాకు ఎందుకూ వాళ్ళు వణుకు తుంది  .
 నేను ఒక్కసారే ఆ సీట్ లోకి వెళ్లి ఆయనను తట్టి లేపాను. హబ్బ  చేయి ముట్టుకుంటే చల్లగా ఐస్ లాగ వుంది. "ఏమండీ ఏమండీ" అని గొంతు  గట్టి చేసుకొని అరిచాను ఒక 20 సార్లు  అన్నానేమో. అందరూ  లేచారు.

"ఏమండీ ఏమైంది" అని అడిగాను. మాట లేదు. కళ్ళు తేలేసారు. నా గుండె లో దడ మొదలైంది. డ్రైవర్ ను బస్ ఆపమని గాట్టిగాఅరిచాను. ఆపారు.
పిల్లలు లేచి ఒకటే ఏడుపు. "అమ్మ నాన్నకు ఏమైంది". అని. నాకే తెలవట్లేదు. వాళ్లకు ఏమని చెప్పను. నాకు ఏడుపు ఆగడం లేదు.
"డాక్టర్ ఎవరైనా వున్నారా? బస్  లో" అని అడిగాను. ఎవరూ లేనట్టుంది. ఎవరూ రాలేదు. నేను తెచ్చుకున్న  బాటిల్ లో నుండి నీళ్ళు చల్లాను. లేవట్లేదు. అందరూ నన్ను ఓదారుస్తున్నారు. ఏమీ కాదమ్మా అని.  నా ప్రయత్నం నేను చేస్తున్నాను. పల్స్ చూసాను.

నాకేం తెలవట్లేదు. మళ్ళీ మళ్ళీ తట్టి లేపాను. లేవట్లేదు. దేవుడా ఈయనకు ఏమైంది. గుండెమీద గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. చేస్తున్నాను. ఏడుపు  వస్తుంది పెద్దగా ఏడుస్తూనే మళ్ళీ పల్స్ చెక్ చేసాను. "ఏమండీ ఏమండీ లేవండీ"  అంటూ.ఒక్కసారే   పల్స్ రన్ అవుతుంది అనిపించింది.  మళ్ళీ chest మీద ప్రెస్ చేసాను.

ఒక్కసారే కళ్ళు తెరిచారు. మళ్ళీ ప్రెస్ చేసాను కాస్త నెమ్మదిగా . అప్పుడు కళ్ళు తెరిచారు పూర్తిగా. భగవంతుడా నీకు వేల వేల దండాలు స్వామీ.
"ఏంటి చిన్నీ నాకేమైంది. అంటున్నారు."  నేనేం చెప్పే స్థితి లో లేను. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. నేనేం చెప్పలేదు.  సంతోషం  తో కూడా మాటలు రావని తెలుస్తుంది. " ఏమ్లేదమ్మ స్పృహ కోల్పోయారు ఏం భయం లేదులే  ఇక" అని  అంటున్నారు.   ఆయన లేచారు చాలు. నెమ్మదిగా అందరూ వారి వారి సీట్లలో కూర్చున్నారు.

మమ్మల్ని మా వారు దగ్గరికి తీసుకున్నారు. నేను లేచాను నా సీట్లో కి వెళ్లాను.  పిల్లలు తండ్రి కి అటు ఇటు కూర్చున్నారు.  ఒక 15   నిమిషాలకు మామూలు స్థితి కి వచ్చాము.
ఎందుకో మరి స్పృహ తప్పారు. తర్వాత వచ్చే స్టాప్ లో బస్ ను ఆపించాను. అందరికీ  చేతులు జోడింఛి  థాంక్స్ చెప్పి బస్ దిగాము. అందరు కూడా "ఏం కంగారు పడకండి డాక్టర్ కి చూపించుకొని రండి." అంటూ ధైర్యం చెప్పారు. అది ఏ ఊరో నాకు తెలవదు.

నేను ఒక పండ్ల  బండి దగ్గర  మావారిని కూర్చొమ్మని,  బి.పి. చూపించు కోవడానికి క్లినిక్ ను వెదుకుతున్నాను. ఒక  షాప్ లో కనపడింది. బాగ్స్  పట్టుకొని అక్కడికి వెళ్ళాము. బి.పి. చెక్ చేయించాను. హమ్మయ్య  నార్మల్ గా వుంది. కానీ డాక్టర్ గారు  లేరు. నేను ఒక ఆటో మాట్లాడి. అతనిని డాక్టర్ వున్న  క్లినిక్  దగ్గరికి తీసుకు వెళ్ళమని చెప్పాను. . govt .hosp . కి తీసుకెళ్ళాడు. అక్కడ కూడా డాక్టర్ గారు లేరు.

  అప్పుడు రాత్రి 1 ౦.౦౦ గంటలు అవుతుంది. ఒక  R .M P డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు. అతను చూసి tablets ఇచ్చి కొంచం సేపు కూర్చోమ్మన్నారు. ఎసిడిటీ అని అన్నారు.  ఆటో అతనిని  మళ్ళీ బస్ స్టాప్ లో దిన్చమన్నాము.అతను అడిగిన దాని కంటే ఎక్కువ ఇచ్చి థాంక్స్ చెప్పాము అందరమూ.

పిల్లలను చూస్తుంటే నాకు బాధేసింది. చిన్న చిన్న చేతులు. ఒక బాగ్ వారికే ఇచ్చాను. ఇద్దరూ కలిసి పట్టుకున్నారు. అప్పుడు రాత్రి 11. 00 అవుతుంది. మేము బస్ కోసం  వైట్ చేస్తున్నాము.  దాదాపు అర గంట ఐంది.  ఇంతలో ఒక కారు మా పక్కన ఆగింది. ఎవరో తెలవదు.
"ఏమండీ ఎక్కడికి వెళ్ళాలి" అన్నారు." హైదరాబాదు ". అని చెప్పాము.  "నేను  అటే వెళ్తున్నాను వస్తారా?" అన్నారు.

ఎందుకండీ బస్ వస్తుంది మేము వెళ్తాము  అన్నాము. ఫరవాలేదు రండి. నేను ఒక్కడినే కదా వస్తారని అడిగాను. నేను మావారు ఆలోచించుకొని వెళ్తే మంచిది అనుకున్నాము.


ఓహ్ గాడ్. ఇతనిని నీవే పంపించావు స్వామీ అనుకున్నాను. సరే అని ఎక్కాము. ఇంకా ఎవరో అడిగారు. వారిని ఎక్కిన్చుకోలేదు. "పేషెంట్ వున్నారు." అని చెప్పారు. అరె! ఇతనికి ఎలా తెలుసు అనుకున్నాను." ఏమండీ  పేషంట్ అని మీకు ఎలా తెలుసు" అన్నాను. "మిమ్మల్ని బస్ దిగిన దగ్గరి నుండి గమనిస్తూ మీ కోసం వైట్   చేస్తున్నాను. మీరు ఈ వూరి వారు కాదు  అనుకొని  ఇక్కడే  ఆగాను. ఏదైనా  హెల్ప్  చేద్దామని . అని అన్నారు. దేవుడా  నీకు వేల వేల దండాలు.
"ఎక్కడ దిగాలి?" అన్నారు." మేము పెళ్ళికి వెళ్తున్నాము. ఎల్.బి.నగర్ లో పెళ్లి. మీరు స్టాప్ దగ్గర ఆపండి.మేము ఆటోలో వెళ్తాము"  అన్నాము. "సరే" అన్నారు. పిల్లలు అలసి పోయారేమో నిద్ర లోకి వెళ్ళారు. మా వారిని కూడా పడుకోమ్మన్నాను. నాకేమో దడ ఇంకా చిన్నగా అలాగే  వుంది. కళ్ళ నుండి నీళ్ళు ఆగట్లేదు. మా వారు కూడా నన్ను  దగ్గరికి తీసుకొని. ఊరుకో అంటున్నారు.

అక్కడికి చేరాక డబ్బులు ఇవ్వబోయాము. అతను వద్దన్నాడు. నేను కిరాయి కి మిమ్మల్ని తేలేదు. నాకు డబ్బులు వద్దు అన్నారు. అందరం చాలా  చాలా థాంక్స్ అని చెప్పాము. పిల్లల తో చెప్పించాము నిద్ర లేపి. ఆటోలో పెళ్ళికి వెళ్ళాము. ముందే మొఖం కడుకున్నాము.  సో.. మా విచారాన్ని బయట పడ నివ్వలేదు. పిల్లల ను కూడా ఎవరికీ చెప్పొద్దూ అని చెప్పాము. ఎన్నో ఫోన్ లు  బస్ లేట్ గ బయలు దేరింది అని  ఎన్నో అబద్దాలు ఆడాను.  ఫోన్ లో ఈ విషయం చెప్పొద్దని.
ఫంక్షన్ హాల్ కి వెళ్ళాము. అందరూ రిసీవ్ చేసుకున్నారు. పెళ్లి అప్పటికి జరిగిపాయింది. ఏంటి లేట్ అని అడుగుతున్నారు . పెళ్లి ఇంట్లో చెప్పడం ఇష్టం లేదు. ఎవ్వరికి కూడా  చెప్పలేదు.  నల్గురం కూడా బట్టలు చేంజ్ చేసుకోలేదు. కొంత సేపు అయ్యాక  నా మనసు నెమ్మదించింది.


మీకు తెలుసా నేను అంత రాత్రి  పెళ్లి అని పట్టు చీర కట్టుకోకుండా ముందు  చెప్పిన  క్రీం కలర్ కట్టుకున్నాను. ఇక చీర మార్చుకోలేదు.  అదే చీరతో వున్నాను. ఆ చీర ను చూసిన వారంతా చాల బాగుంది అన్నారు. ఆ చీరకు ఎన్ని కాంప్లిమెంట్స్ అంటే  చెప్పలేను. నవ్వి ఊరుకున్నాను. ఎంజాయ్ చేసినట్టు చేసాను. ఈ చీర ఎంతకు కొన్నావు.  నాకు కూడా కొనివ్వు. డబ్బులు ఇస్తాము అంటూ ఒకటే తొందర చేసారు. . పెళ్లి  తర్వాత  ఎవరం ఎక్కడో కదా. ఇక ఆరాత్రి మా అక్క వాళ్ళింటికి వెళ్లి పడుకొని పొద్దున్నే టిఫిన్ చేసి మళ్ళీ  మా వూరికి చేరాము.

ఈ సందర్భం తలచుకున్న కొద్ది నాకు భయం ఆగదు. అది గుర్తుకు వస్తే పిల్లలు, నేను వేరే పనులు చేసుకుంటాము వెంటనే.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Saturday, 15 October 2011

మా కాలేజ్ కి నేను ఎలా వెళ్ళాలి? దేవుడే దారి చూపాడు

ఒకప్పుడు నాకు మొహమాటం చాల ఎక్కువ. ఇప్పుడు కాస్త తగ్గింది కాని పూర్తిగా కాదు. ఒక రకంగా నన్ను  అందరూ ఉపయోగించుకుంటారు. నాకు అర్థం అవుతుంది కాని   " ఎదుటివాళ్ళను వీలైనంత క్షమించడం నా బలహీనత."
"పని చేయలేను", "చేయను"," తర్వాత  చేస్తాను"  అని చెప్పడానికి నేను ఇబ్బంది పడతాను.   సరే ఇదంతా ఎందుకంటే  మొహమాటం,  బెరుకు వల్లే నేను, మా అక్క, మా నాన్న  చదువుకున్న మా వూరి డిగ్రీ కాలేజ్ కి  10 yrs  వరకు వెళ్ళలేక పోయాను.

 నా డిగ్రీ ఐపోయాక పెళ్లి, సంసారం . రోజులు గడుస్తున్నై. నేను చదువుకున్న కాలేజ్ కి వెళ్లి ఆ రూం లు అన్ని ఒకసారి చూడాలి అనుకొనేదాన్ని. కాని ధైర్యం చేయలేక పోయాను. నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ వుండరు. ఎవరిపనిలో వాళ్ళు వుంటారు. ఇతరులు రావొద్దు అని అంటారేమో అని భయం.  కాని ఎలా ఎలా ఎలా వెళ్ళాలి.  నాకు తోడు ఎవరూ లేరు. క్లాస్మేట్స్ అంతా ఎక్కడో సెటిల్ అయ్యారు. జ్ఞ్యాపకాలు క్లాస్మేట్స్ తో పంచుకుంటేనే బాగుంటాయి. 

ఒకరోజు సండే పేపర్ లో అదే  కాలేజ్ కి కంపూటర్ నాలెడ్జ్ వున్న ఆడవారు కావలెను(టెంపరరీ)  అని వచ్చింది. టైం కరక్ట్ గా 9 .00 a .m అయ్యింది. ఫోన్ చేసాను. 9 .30 a .m రమ్మన్నారు. గబా గబా తయారయ్యాను. ఆటో తీసుకొని సర్టిఫికెట్స్  జీరాక్స్  తీయించుకొని వెళ్ళాను. పిన్ చేయలేదు వాటికి. నా దగ్గర వున్న పిన్నీస్ పెట్టాను. ఎలాగో అనిపించింది. కాని పని జరగాలి కదా. అది ముఖ్యం.  

కరక్ట్ గా 9 .30 a .m అయ్యింది. నాకంటే ముందు ఇంకా 10 మంది వున్నారు. వాళ్ళు కొత్తగా డిగ్రీ చదివారేమో యంగ్ గా వున్నారు. నేనేమో 8 yrs పెద్ద. గోవిందా అనుకుంటున్నాను. జాబ్ పేరుతో నా కాలేజ్ కి వచ్చాను చాలు అనుకొని కాలేజ్ మొత్తం తిరిగాను మెల్లగా. మా నాన్న చదువుకొనే రోజుల్లో  పాడే  "శిలలపై శిల్పాలు చెక్కినారు" అనే పాట  నా చెవుల్లో మోగుతుంది. (నేను చూడలేదు మా నాన్న చెప్పారు). మా అక్క  పాడిన"ఇది మల్లెల వేళయనీ" పాట, నేను డి.జి.పి. ఎ.కే.ఖాన్ గారితో ఫస్ట్ ప్రైజ్ అందుకున్న " ఆకులో ఆకునై " పాటలు కూడా. గాలిలో తేలినంత ఆనందం.  చెప్పలేను.

ఇంటర్వ్యు నా వంతు వచ్చింది.  అన్నీ అడిగారు. జీరాక్స్ పేపర్స్ చూసారు. మరీ పిన్నీసు కూడాను .  నవ్వి "పిన్ పంచ్   లేదట సర్ షాపులో"  అన్నాను. తను కూడా నవ్వి ఊరుకున్నారు. మెమో చూసారు. "ఈ కాలేజ్ లోనే చదివావా అమ్మా?" అన్నారు. "అవును సర్" అన్నాను. సంతోష పడ్డారు. అక్కడే నాకు తెలిసిన ఇద్దరు లెక్చెరర్స్  ను విష్ చేసాను. నా రైటింగ్ చూసారు. లెటర్ వ్రాయమన్నారు. ఇంకా చాల అడిగారు.  ఫోన్ చేస్తామన్నారు. ౩ డేస్ కు ఫోన్ చేసారు.

అప్పటికే నేను 2  ఆఫీస్ లలో చేయడం,  మహిళను కావడం,  అదే కాలేజ్ లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవడం,  ప్రిన్సిపాల్ కు  లెటర్ చాల బాగా వ్రాయడం, నా రైటింగ్, నా ఎలిజిబిలిటీస్ అన్నీ చూసారు. వచ్చిన అందరూ నాకంటే చదువులో ఎక్కువే వున్నారు. కాని ఎంట్రెన్స్ లని, పెళ్ళిళ్ళు అని మధ్యలో వెళ్తారు అని తీసుకోలేదు.  ఇంకొక ముఖ్య విషయం  ఏంటంటే ఎవ్వరికీ  కూడా తెలుగు లో లెటర్ పధ్ధతి గా వ్రాయడం తెలీక పోవడం పెద్ద ఆశ్చర్యం. పోనీ ఇంగ్లీష్ లో కూడా వ్రాయలేక పోయారు.

నేను సెలెక్ట్ అయ్యాను. నన్ను ఉదయం 8 గంటల నుండి రమ్మన్నారు. హమ్మో  నా వంట, నా పిల్లలు, ఇంట్లో పనులు, మా వారు నా  కళ్ళముందు మెదిలారు. అంత తొందరగా నేను రాను సర్ అన్నాను. 9 .30 a .m . నుండి వస్తాను అన్నాను. చాల బతిమిలాడారు. సరే అని ఒప్పుకున్నాను. అలా 4 ఇయర్స్ చేసాను. ప్రతిరోజూ కొత్తే. ఒక్కనాడు కూడా సెలవు పెట్టలేదు. ఇష్టమైన పని. ఇష్టమైన కాలేజ్. ఇంకేముంది.  స్టూడెంట్స్ నాతో మంచిగా బిహేవ్  చేసేవారు. లెక్చరర్స్ తో సమానమైన మర్యాదలు. స్టూడెంట్స్ పార్టీలు, ఇదే సమయమని నేను కూడా నా పాటల యుద్ధం మొదలు పెట్టాను.(పాటలంటే నాకు చాల ఇష్టమని  బ్లాగ్ లలో రాసాను.)

"దేవుడా నా కోరిక తీర్చావు స్వామీ" అనుకోని సందర్భం లేదు. దేవుడు దారి ఎలా చూపెట్టాడు అని నాకు ఎంతో ఆశ్చర్యంగా వుంటుంది.  జాబ్ చేస్తూనే టైపింగ్ తెలుగు, హిందీ, టాలీ  నేర్చుకున్నాను. ఇంగ్లీష్ ముందే వచ్చు చాలా ఫాస్ట్ గా చేస్తాను.

(పండ్లువున్నచెట్టుకే రాళ్లు అన్నారుగా. నాకు పని భారం ఎక్కువవ్వడం వల్ల, మొహమాటం వల్ల , "నో" అని  చెప్పకపోవడం వల్ల,  సాలరీ పెంచకపోవడం వల్ల అలసి పోయి జాబ్ వదిలేసాను. )
 

Tuesday, 19 July 2011

నా రెండు ( సమీర, నందన ) బ్లాగ్ లు ఆపేస్తున్నాను.

నా రెండు   (  సమీర, నందన ) బ్లాగ్ లు  ఆపేస్తున్నాను.
ఎందుకంటే  అందరి బ్లాగ్ లు చూస్తుంటే నేనెంత అజ్ఞ్యానురాలినో తెలుసుకున్నాను.  నేను రాయడం అనవసరం. టైం వేస్ట్. దాని  బదులు చాల మంది రాసే బ్లాగ్ లను చదివితే కాస్త మెదడుకు పదును ainaa    వస్తుంది.
బ్లాగ్ లు చదవడం వల్ల నాకు ఎన్నో విషయాలు తెలుస్తున్నై.  నేను రాసి మిమ్మల్ని చంపే బదులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లోనే నాకు ఆనందం. మహాను భావులు ఎందఱో అందరికీ నా మనఃపూర్వక వందనాలు.  ఎంత మంచి రచనలు బాబోయ్.         
  ఓ  దేవుడా కాస్త వారివి చదవడం వాళ్ళ నాకు జ్ఞ్యానాన్ని ప్రసాదించు స్వామి.
కాబట్టి ఇదే నా చివరి బ్లాగ్ రచన(అదే అంటారా?).     కానీ నేను వ్యాఖ్యలు చేయడం  మాత్రం మానను.      నా గురించి చెప్పేంత గొప్పదాన్ని  కాను.  నా గురించి ఆలోచిస్తే  నాకే నవ్వొస్తుంది. బావిలో కప్పను అని అర్థం ఐంది.    By.

Monday, 18 July 2011

@@@@@@@@@@@@@ ఐ కాన్ ఐ కాన్ ఐ కాన్ ఐ కాన్

ఐ  కాన్   ఐ  కాన్  ఐ  కాన్  ఐ  కాన్ అనుకోవడం నాకు చాల ఇష్టం. దాన్ని ఎల్లవేళలా ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంటాను. అలా అనుకొని  పనులు చేసుకోవడం  మా వారికి చాల తీరకను కల్గించింది.  నాకు ఆత్మవిశ్వాసాన్ని, కాస్త నష్టాన్ని కూడా కల్గిస్తుంది.
"జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బాధ్యతా యుతంగా వుండడం నాకు ఇష్టం. "

ఎలా అంటే చిన్నప్పటినుండి నాకు మాత్స్ అంటే పిచ్చి ఇష్టం. నా ఇంటరెస్ట్ ను గమనించి మా గురువులు నన్ను ఇంజినీర్ చేయమని చెప్పేవారు. కానీ  బి.పి.సి  తీసుకోవడం తో రాంగ్ రూట్ ఐపోయింది.

కానీ నా మెకానిజం  ను ఇంట్లో ఉపయోగిస్తుంటాను అప్పుడప్పుడు.  ఇంట్లో వుండే ప్రతి ఆడవారు ఇలా చేసుకోవడం తప్పనిసరి. మెదడుకు పదును, ఖర్చులు మిగులుతాయి.   చిన్నపనికి మెకానిక్ ను పిలవాలంటే వాళ్ళు  టైం  కి రారు, మరియు వారి ఇష్టం వచ్చినట్లు డబ్బులు అడుగుతారు.

గ్యాస్ స్టవ్ చెడిపోతే నేనే బాగు చేసుకుంటాను పూర్తిగా.

గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడం కూడా చాలామంది చేసుకోరు. (అనుకుంటాను.)

fuse  పొతే ఎవ్వరినీ పిలవను. నేనే చేసుకుంటాను. మెయిన్ ఆఫ్ చేస్తాను. వైర్ చుట్టేసి సాకెట్ లో పెట్టేస్తాను.

గ్రైండర్ చెడిపోతే బాగు చేసుకుంటాను.  (పెద్ద ఎత్తున ఐతే షాప్ కే)

రైస్ కుకర్ కూడానూ.

ఇంట్లో నల్లాలు లీక్ అవుతుంటే పాతవి తీసేసి. కొత్త వాచర్ మరియు కొత్త టాప్ లు కూడా బిగిన్చేస్తాను.

వాల్ క్లాక్స్ బాగుచేస్తుంటాను.
 
ఫాన్స్, హీటర్, బల్బ్ కనెక్షన్స్  చేస్తుంటాను.   

ఇక బయటి పనులు కూడా ఎన్ని ఉంటాయో  మీకు తెలుసు కదా అవన్నీ ఒక్కదాన్ని చేసుకుంటాను. (చాలామంది చేసుకుంటారు లెండి అంటారేమో)

బాడ్మింటన్, కారంస్ బాగా ఆడతాను. ఎప్పుడు కూడా చాల ఉత్సాహంగా ఉండడానికి ప్రత్నిస్తుంటాను.

చాల కష్టమైనా పనిని చిన్నగా ఎలా చేయవచ్చో ఆలోచిస్తూ ఉండి, ఆ విధంగా చేస్తాను.

కుట్టు మిషిన్ కొత్తగా వచ్చినప్పుడు దాన్ని నేనే 10 వ  తరగతిలో బిగించాను.

మా వారి ప్యాంటు జేబులు చినిగి పోతూ వుంటే  వాటిని మంచి దట్టమైన కాటన్  క్లోత్ తో మళ్ళీ కుట్టేస్తాను.
బటన్స్, కాజాలు ఇవన్నీ మామూలే.

వంటింట్లో నల్ల ఒక మూలకు స్టవ్ ఇంకొక మూలకు వుంటై కదా.    అప్పుడు నల్ల నుండి స్టవ్ దాక ఒక పైప్ పెట్టుకొని గ్యాస్ స్టవ్ ను కడుగోతూ ఎప్పుడు కూడా నీట్  గ ఉంచుకోవచ్చు.

నల్ల సంపులో నీళ్ళు చాలా ఉండి పొతే  దాని లోని పైప్ బయటికి తీయకపోతే నీళ్లన్నీ లాగేసుకుంటాయి కదా.  ఆ పైప్ చివరికి ఒక తర్మకోల్ ని కట్టేస్తే అది పైకి తేలుతుంది. అప్పుడు సంపులోని నీళ్ళు ఇంకిపోవు. నీళ్ళు ఎక్కువ కావాలి అంటే మాత్రం దాని కిందికి వేసి గమనించాల్సిందే నండి.

అందరికీ మీకు సహాయంగా నేనున్నాను అనేటట్టు ఉండడానికి ప్రయత్నిస్తుంటాను. ( చేయగలవి మాత్రమే )  మాట సహాయం కూడా కొందరికి ధైర్యాన్ని ఇస్తుందని నా అభిప్రాయం.

ప్రతి ఫంక్షన్ కి అటెండ్ అవుతాను. నేను రాలేదు అంటే నాకు ఏదో పని తగిలింది అని అందరికీ తెలుసు.  అందుకని ఎవరూ ఏమీ అనుకోరు.
మొబైల్ ను నాకు ఉపయోగంగా వాడుకుంటాను. అలారం, రిమైండర్, SMS లు తప్పకుండా పంపిస్తాను. ఈ రోజుల్లో ప్రయాణాలు తక్కువయ్యాయి కదా .
బర్త్ డే అందరివీ ఆ రోజుకి 5 సం దాకా రిమైండర్ లో ఉంచేస్తాను.
ఒక్క పూజలు, గుడి కెల్లడం  మరియు సాహిత్యం లో మాత్రం ఇంటరెస్ట్ కలగడం లేదు. 
గుడికి వెళ్తే మాత్రం మనస్ఫూర్తిగా  ఒక 1   గం. ఐన కూర్చుంటాను.

ఇక నాకు నష్టం ఏంటంటే  మా వారు ఆఫీస్  పనులతో బిజీ ఇపోవడం వలన అప్పట్లో పనులన్నీ ఆయనకు చెప్పకుండా చేసుకున్నాను. ఇప్పుడేమో నీకు అన్నీ వచ్చుకదా ఇంకా మెకానిక్ ఎందుకు అంటారు.   ఏమండీ ఏమండీ అని ప్రాధేయ పడకుండా చేసుకున్నాను. ఖర్మ.  ఏమీ పనులు చేయకుండా ఐపోయారు.  
మీరు మాత్రం అలా చేయకండి.  మగవారికి పనులు చెప్పడం కూడా చేయండి.

వుంటాను. మీ అభిప్రాయాలను తప్పకుండా చెప్పండి.  బై

Saturday, 2 July 2011

నా సర్టిఫికెట్స్ గురించి పే.పే పే పే ద్ద కథ.... మీకు చాలా ఓపిక ఉంటేనే..... చదవండి.

ఎక్కడినుండి మొదలుపెట్టాలి మ్....మ్....మ్
సరే...........మా గృహ ప్రవేశం ఫంక్షన్ ఐపోయాక,మేము కొత్త ఇంట్లో కి సామాను చేరుస్తున్నాము. ప్రతి ఐటెం ను చెక్ చేసి కొత్త ఇంటికి పంపిస్తున్నాను. నేను పాత ఇంట్లో జాగ్రత్తగా అన్ని చూస్తున్నాను. అవసరం లేనివి ఒక వైపు కుప్పగా పేర్చాను. తర్వాత నన్ను కొత్త ఇంట్లోకి పంపారు సర్దాలని. అన్ని వస్తున్నై వాన్ లో. అన్ని  సర్ది పెట్టించాను. 
               ఈలోగా మా మన్చాలు మరియు పరుపులు వచ్చాయి. నా  గుండె గుభేల్ అన్నది.  హమ్మో నా సర్టిఫికెట్స్  పరుపుల కింద పెట్టినట్టు నాకు గుర్తు. లేక ఒక వైట్ కవరు లో ఎక్కడో  పెట్టినట్టు మరో గుర్తు. సరే ఇంట్లో అందరూ ఉన్నారుగా చెక్ చేస్తారు లే అనుకున్నాను.  ఈ లోగ నా వైట్  కవరు కూడా వచ్చినట్టుంది. మావారు నాకు చెప్తూ " చిన్నీ నీ వైట్  కవరు కూడా వచ్చేసింది" అన్నారు. హమ్మయ్య అనుకున్నాను. అందరం కొత్త ఇంట్లో హాయిగా ఎంజాయ్ చేస్తూ వున్నాము.    ఒకానొక రోజున..........
దాదాపు 15 రోజుల తర్వాత నాకు ఒక ఇంటర్వ్యు కాల్ వచ్చింది. ఇంటర్వ్యు  వుందని, సర్టిఫికెట్స్ తీసుకురమ్మని కవర్ పంపారు. నేను మా వారిని అడిగాను " ఏమండీ  నా సర్టిఫికెట్స్ కవరు ఎక్కడ పెట్టారు?" అని.
"బీరువా లో "అన్నారు.    ఆఫీస్ కు వెళ్లారు. 
బీరువాలో ఒక్కొక్క షెల్ఫ్ చూస్తున్నాను. అదులో నేను అనుకున్నవైట్ కవరు కు బదులు గా వేరే వైట్ కవరు వుంది. నా గుండె అతి వేగంగా కొట్టుకుంటుంది.  అందులో వేరే పేపర్స్ ఉన్నవి. దేవుడా..అనుకుంటూ .........  గబుక్కున మావారికి  ఫోన్ చేసాను. అదే కవర్ అని చెప్పారు.  నా గుండె కిందికి జారింది.సర్టిఫికెట్స్ కవరు లేదు.
  హమ్మో  ఇప్పుడు ఎట్లా? నా కష్టార్జితాలు. నా టెన్త్. ఇంటర్, డిగ్రీ సర్టిఫి. బాబోయ్ . పి. జి చేయాలనుకున్నాను. ఇంకా ఎన్నో.  అన్ని చోట్లా వెదికాను. అందరినీ అడిగాను. లాభం లేదు.   నాకు తల తిరిగిపోతుంది. చదువుకోని దానిలా కనబడుతున్నాను.

పాత ఇంటివాళ్ళకి ఫోన్  చేసాను.  వాళ్ళు  వున్నారా  వూరికి  వెళ్ళారా అని. ఉన్నారట. జెట్ స్పీడ్తో పాత ఇంటికి వెళ్ళాను. మిట్ట మధ్యాహ్నం ఐంది.  సర్టిఫికే ట్స్ గురించి చెప్పాను. అందరు ఏమో అన్నారు. చెత్త అంతా మూల కు వున్న పెద్ద బావిలో వేసారు మీరు. అక్కడ చూడండి అన్నారు.

వేగంగా పరుగెత్తాను. బావి చాలా లోతుగా వుంది. చెత్తా చెదారం వున్నై. అందులోకి చూసాను. ఎన్నో కవర్లు వున్నాయి అందులో ఏదో అర్థం కాలేదు.  ఎలారా భగవంతుడా అనుకొని చుట్టూ చూసాను. బావి లోతు కర్ర దొరుకుతుందా అని. ఎక్కడా లేదు. అందరినీ అడిగాను. ఎవ్వరూ లేదన్నారు. మిద్దె మీదికి వెళ్ళాను. మొత్తం చూసాను.
           ఒక అటక మీద కర్ర కనబడుతుంది. కాని నాకు అందడం లేదు. ఒక తాడు తీసుకున్నాను. దాన్ని ముడి వేసి కర్రకు విసిరాను. మెడలు లాగుతున్నై. 3 వ సారి దానికి పట్టుకుంది. కిందికి లాగాను. దేవుడా దేవుడా అనుకుంటూ చూద్దును కదా  అది సరిగ్గా బావిలోతు వున్న  వెదురు కర్ర.  దేవుడా నీకు వేయి నమస్కారాలు.
                 దాని చివరికి ఒక సీలను కొట్టాను.  కవరు వుంటే పట్టి లాగొచ్చు అని. తొందరగా బావి దగ్గరికి వెళ్లాను. మళ్ళీ చీకటి పడితే బావిలో ఏమీ కనబడదు. అందరూ (పిల్లలు, పెద్ద ఆడవాళ్ళు) నా వెనకాల వచ్చారు. బావిలోకి కర్రను పోనిచ్చాను. చెత్త జరుపుతూ కవర్లు చూస్తున్నాను. ఒక్కొక్క కవరు ను తీస్తూ పోయాను. అందులో తడి చెత్త పొడి చెత్త  15 రోజుల క్రితం నుండి కదా అన్నీ వున్నై.  చేతులు నొప్పి పెడుతున్నాయి. మగ వాళ్ళు ఎవ్వరూ లేరు.
            గంట ప్రయత్నించగా ఒక బ్లాక్ కవరు కింద వున్న వైట్ కవరు కనబడింది. దాన్ని సీలకు పట్టిచ్చి పైకి లాగాను.  ఎలుకలు తిన్నట్టు గా ఉన్న నా కవరు కనబడింది. పైకి తీశాను. అవే. దేవుడా నీకు పదివేల నమస్కారాలు స్వామి.  సర్టిఫికెట్స్  లామినేషన్ తో వున్నై  కదా మూలలు మాత్రం ఎలుకలు తిన్నాయి.
          అందరూ నా అదృష్టం బాగుంది కాబట్టే అవి దొరికాయి అని అంటుంటే  దొరికిందే చాలని మళ్ళీ కొత్త ఇంటికి పరుగెత్తాను. దేవుడికి దండం పెట్టుకున్నాను. అవి వుండడం వల్ల  నేను ఇప్పటికి ఒక 5 సం నుండి 3 లక్షలు  సంపాదించాను. లేకపోతె ఏం జరిగేదో.

ఇంకొక కొస మెరుపు ఏంటంటే ఏంటంటే ఏంటంటే........ నేను సరిఫికేత్స్  తెచ్చిన రోజు సాయంత్రం  కుండపోతగా ఒకటే వర్షం. ఇప్పటికీ నేను చాలా ఆశ్చర్యపోయే సంఘటన ఇది. మీకు ఎలాగ వుందో నాకు రాస్తారు కదా. బై. 


Thursday, 16 June 2011

"పిచ్చిదానివి, వెర్రిదానివి,బుర్రలేనిదానివి, బుద్ధి, జ్ఞానం ఏమీలేవు నీకు. లేకపోతె ఇంతపని చేస్తావా?జైంట్ ఫామిలీ అంటావా?"

          "పిచ్చిదానివి, వెర్రిదానివి,బుర్రలేనిదానివి, బుద్ధి, జ్ఞ్యానం ఏమీలేవు నీకు. లేకపోతె ఇంతపని చేస్తావా?"
 "ఏం చేసాను?"     " ఏం చేసావా? ఇంకా ఏమ్చేసాను అంటావా? హబ్బా ఇంకా నీకు బుద్ధి రాలేదు. మొగుడుకి  జాబ్  వుంది  మంచిగా  బయటికి   వెళ్లి  వుండకా , జైంట్ ఫామిలీ లో ఎందుకువుండలేనూ అని పంతం కొద్దీ వున్నావ్." 
"అవును వున్నాను. "
"ఇరుకు ఇంట్లో వున్నావ్. బెడ్రూం అయినా ఉందా అదీ  లేదా? నాకైతే డౌటే ! "     "ఆ ఆ వుంది మధ్యలో "     "ఏన్టీ మధ్యలోనా? అంటే అందరూ మీ గదినుండే వంటింట్లో కి వెళ్ళాలా? "  " అవును"     " ఓహ్ హతవిధీ"
"సరే మీవారికి జాబు అన్నావ్. ఉందా?" "ఆ ఆ వుంది"
"తోడికోడలికి జాబు వచ్చేటట్టు చేసావా?"  
"ఆ ఆ అవును"       
" మరి నీపిల్లల్ని, వాళ్ళ పిల్లల్నీనువ్వే  చూసావా?"   "ఆ ఆ అవును. అత్తగారికేమో  చేతకాదు,  తను బి యిడి , డి యిది. కోచింగ్ కు వెల్తుంది కదా! అందుకని"
"మరి నీకు జాబ్?  నీవు చదువుకోలేదా? "  " ఆ ఆ చదువుకున్నాను, నేను బ్రిల్లియాన్ట్  స్టూడెంట్ ను అప్పట్లో డిగ్రీ 1   స్త్   క్లాస్ లో పాస్ అయ్యాను. మరి నేను కూడా వెళ్తే ఇంట్లో పని ఎవరుచేస్తారు?" 
"వంట, కూరగాయలు తేవడం, బయటిపని అంటా నువ్వేనటగా?"  "అవును మరి అత్తగారు, మామగారు ఇంట్లో, మరిది కి నేను చెప్పలేను , మావారు బయట ఆఫీస్ లో కదా ఎట్లా తెస్తారు? అందుకనీ నేనే తెచ్చేదాన్ని"
" అందుకే బుద్ధి లేదు అన్నాను."  " సరే ఇట్లా ఎన్ని రోజులు గడిపావో చెప్పుతావా తల్లీ!"    " ఆ ఎందుకు చెప్పనూ
మా వారికి ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి ఒక 13 సం. వున్నాను. "
"ఏంటీ?  నా తల తిరుగుతున్నది. . కాస్త పట్టుకోవే. పడిపోతున్నాను.  కళ్ళు తిరుగుతున్నాయి. 13 సంవత్సరాలా? హమ్మో హమ్మో అదే ఇంట్లోనా? "  " అవును "     " మరి ఇంట్లో పోట్లాటలు రాలేదా."
" ఎందుకు రాలేదు వచ్చాయి. అందరూ నన్ను ఊరుకోమ్మన్నారు." 
" ఎందుకు అనరూ అలానే అంటారు. మరి నోరులేదుగా నీకు.  ఓహ్ గాడ్, అల్లా ,  జీసస్,  భగవంతుడా, వాహే గురూ  ఈ రోజుల్లో ఇలాంటి వారున్నారా స్వామీ.....?
" సరే మీ వారు ఏమనలేదా?"        " అన్నారు,బయట అందరూ వింటే పరువు పోతుంది. కనీసం నీవైన నోరుమూసుకోవే అన్నారు అందుకని నేను........."    " ఓహో ఎవరు ఎమన్నా కూడా నోరుమూసుకొని ఒర్చుకున్నావన్నమాట!"   " అంతేకదా గొడవలు వద్దనీ....."  "పిల్లల కు లంచ్ ?"     " ఆ జంట అప్పుడప్పుడు వెళ్ళేవారు. వాళ్లకు బజాజ్ వుంది అందుకని."    "ఓహో బండి వుండి కూడా అప్పుడప్పుడు వెళ్ళేవారా? రోజూ కాదా ? బాగుందమ్మా" 
"మరి ఖర్చులు?"   " మామగారు, మావారు"    "govt జాబ్ తెప్పించావా తోడి కోడలికి? మాణ్చిగా  చేసుకుంటుందా? "
"ఆ ఆ తెప్పించాను.వెళ్తుంది, బస్సులో  ఉ.8 .౦౦ వెళ్లి స.  5 గం.కు వస్తుంది. "  " వచ్చాక నైనా పని చేసేదా, అదీ లేదా ?"    " చేతకాదని పడుకోనేది"    
    " తను చదువు కుంటుంటే  నీవు పనిచేసే దానివా, ఓహో చాలా బాగుందమ్మా "     " అంతే కదా, తనకు జాబ్ వస్తే ఇంట్లో కొంత ఖర్చులు షేర్ చేసుకుంటుందని అనుకొన్నాను .ఇంట్లో ఖర్చులు ఎక్కువ కదా "     " మరి షేర్ చేసుకుందా "       "లేదు జాబ్ తను ఒక్కతే  కష్టపడి సంపాదిన్చుకుందట. అందుకని ఇవ్వలేదు"       "ఎందుకిస్తుంది  పడవ దాటేటప్పుడు ఓడ మల్లన్నవు. దాటినాక బోడి మల్లన్నవు సరే మరి  ఇంట్లో చుట్టాలు ?"   "నేను ఇంట్లోనే కదా వడ్డించే దాన్ని" 
" అందుకే పిచ్చిదానివి అన్నాను. సరే ఇప్పుడు ఏమైందో చెప్పు." 
"జాబ్ వచ్చాక గొడవలు తేవడం తో మా అత్తగారు రెండు  జంటలను   బయటికి వెళ్ళమన్నారు."
" అంటారు ఎందుకు అనరూ. ఇల్లు తన పేరుమీద వుంది. చిన్న వాళ్లకి జాబ్ వుంది. మరిది రియల్ ఎస్తేతర్,     తమరేమో పనిమనిషిగా రోల్ చేస్తూ  జైంట్ ఫ్యామిలీ పిచ్చిలో పడి ఉద్యోగం రాకుండా చేసుకున్నారు . వాళ్లకు రెక్కలు రాగానే వెళ్లారు. ఆ ఆ ఇంకా చెప్పమ్మా'"  
"ఇప్పుడు ఆస్తి అంతా కావాలట గోల చేస్తున్నారు. "   
  "నాకు సంక్రాంతి మోవీ గుర్తుకు వస్తుంది. కాస్త అలానే వుంది ఐతే నీవు స్నేహ లాంటి దానివి అన్నమాట .ఆ ఆ మరి ఇచ్చేయకపోయారా జైంట్ ఫ్యామిలీ అని చచ్చావుగా మరి. ఆడ పిల్లల్ని పెట్టుకొని మీ భవిష్యత్తు ఎంటట మరి?  మామా గారు పంచకుండా ముందే పోయారా?"  
"అవును"    
  "జీవుడు తప్పించుకున్నాడు. అవునూ  మీ  అత్తగారు మీ దగ్గరేనా? " 
"అవునట నేనే మంచిగా చూస్తానట. ఆమె  దగ్గరికి వెల్లదట "  " అవును, వొళ్ళు మంచిగా వున్న  టైం లో బయటికి వెళ్ళమన్నారు. ఇప్పుడు చేతకావట్లేదేమో నీవు చేస్తావుగా ఎగబడి సేవలు అందుకని నీ దగ్గర వుంట దేమో అంతేనా?"    " ఏమో"  
"ఏమో అనకు నాకు ఒళ్ళు  మండుద్ది.   సో,  అందరూ కలిసి నిన్ను వెర్రి బాగుల్దాన్ని చేసారు.జాబూ లేదు, ఆస్తి లేదు, కష్టం దోచుకున్నారు. వాళ్ళ  పిల్లలకు  చేయించుకున్నారు. అందుకే అన్నాను  బుర్రలేని వెర్రిదానివి అని"     
" ఏమో మరి నాకు తెలవదు. మరి అందరూ కలిసి ఉండమని అంటారుగా"
" హాసి పిచ్చిమోఖమా అందుకే అంటున్ననే    ఈ రోజుల్లో కలిసి అస్సలే ఉండొద్దు. మనసులు కలిస్తేనే, ఖర్చులు అందరు కలిసి పెట్టుకుంటేనే వుండాలి. అందరూ  ఒక్కరి మాట వింటేనే  వుండాలి. ఆస్తులు పంపకాలు జరిగితేనే వుండాలి. ఇండ్లు దగ్గరగా తీసుకొని విడి విడి గా వుండడమే మంచిది. రోగాలు వచ్చినప్పుడు కలిసి చేసుకోవాలి. ఖర్చులు ఎవరివి వారే పెట్టుకోవాలి.  నీలాన్తివారు వుంటే నెత్తిన ఇలానే  గుడ్డ వేస్తారు.ఎట్లా బతుకుతావో ఏమో. ఇప్పుడైనా కాస్త కళ్ళు తెరిచి, ఇహలోక జ్ఞానం కలిగి, తెలివినేర్చుకొని కాస్త ........ ఏమోనే నేను ఎంత చెప్పినా  నీ బుద్ధి వంకరే మళ్ళీ జైంట్ ఫామిలీ అని కలవరిస్తావు. దేవుడా, పరమాత్మా దీన్ని నీవే...............దగ్గరుండి, చేయి పట్టుకొని, బలవంతంగా రక్షించు స్వామీ రక్షించు.  నాకు బుర్ర చాలా వేడిగా వుంది. కాస్త ఛాల్లటి మజ్జిగ ఉప్పు, నిమ్మకాయ, చక్కర కల్పుకొని తాగి పడుకుంటాను. హమ్మో హమ్మో "   


Monday, 13 June 2011

చదివి ఎవరైనా సలహా ఇవ్వండి, త్వరగా. టైం లేదు

నాకు చాల రోజులనుండి తల పగిలిపోతుంది ఆలోచించి. నా ప్రోబ్లం  ఏంటంటే నేను ఒక జాబ్  చేస్తున్నాను మూడు సం. నుండి.౩,600 /- లకి. సాలరీ 400 పెరుగొచ్చు అనుకుంటాను. నాతో ఇంకా ౩ చేస్తారు సెం సాలరీ తో. నేను అక్కడ  ఇంకా టైపింగ్ (తెలుగు,హిందీ,ఇంగ్లీష్,సంస్కృతం, మాథ్స్ , నోటరీ ) కూడా చేస్తాను. వారికి అవి రావు. బాధ్యతలు నాకే ఎక్కువ . సర్ కు నా పని మీద డౌట్ లేదు. జాబ్  టైమింగ్స్ ఉ.10 .30 టు స.4 .౩౦. వరకు. చాల బాగుంది. నాకు ఒక 1 ,౦౦౦ . పెరిగితే బాగుండు అనుకున్నాను. కాని పెరగదు. కాబట్టి నేను సొంతంగా జీరాక్స్  పెట్టుకోవాలని వుంది. పెట్టుకొమ్మంటారా? నాకు మాథ్స్, ఇంగ్లిష్ ట్యూషన్ చెప్పాలని వుంది. 
       జీరాక్స్ మిషన్ రడీ గ వుంది. కాని జాబ్ వదులుకోవాలి. జీరాక్స్ తో నేను  సంపాదించగలనా అని నా డౌట్. 
జాబ్ కి బుధ వారం దాకా టైం వుంది. నాకు సాలరీ 7 ,౦౦౦/- కావాలని వుంది. ఏం చేస్తే బాగుంటుంది?
మా వారు నీ ఇష్టం ఏదైతే అది చేయి అంటున్నారు. మీరు ఏమంటారు?

 

Monday, 6 June 2011

తీరని కోరిక చాలా సం. కు తీరిన వేళ

ఇది జరిగిపోయిన సంగతి. కాని మదిలో నిలిచిపాయింది.
       నాకు పాటలు అంటే చాలా పిచ్చి.చిన్నప్పటినుండి కూడా నేను  పాటల పోటీలో ఎప్పుడూ ఫస్టే.   నాన్న నాకు నేర్పించేవారు. పెళ్లి జరగక ముందు రేడియో లో వివిధ భారతి, మంచాహే గీత్ వింటూ వుండేదాన్ని. పెళ్లి జరిగాక అన్నీ బంద్. నా బిడియం వల్ల కావొచ్చు, లేదా టి.వి.వల్ల కావొచ్చు, ఉమ్మడి కుటుంబం వల్ల  కావొచ్చు, నా కోరికలు 16 స.వరకు తీరలేదు.నాకు సంగీతం రాదు. కాని  సంగీతం వచ్చిన వాడు మూగవాడైన పరిస్థితి నాది. ఆ బాధ నాకే తెలుసు. గొంతు విప్పి పెద్దగ పాడుకోవాలని ఇష్టం. ఆరుబయట నా ఇష్టంగా పాడుకోవాలని ఇష్టం. కాని ఏం చేయను. అద్దె ఇల్లు. ఇరుకు ఇల్లు. 
   ముందు నాకు తోడుగా మానాన్న పాడేవారు. కాని నా పెళ్లి కి ముందు చనిపోయారు. ఘంటసాల పాటలు ఉన్నంత వరకు నా మదిలో మా నాన్న కూడా అలాగే వుంటారు. అలాగే పాడేవారు. నాలో ఎవరితోనైనా కలిసి పాడాలనే  కోరిక అలాగే వుండిపాయింది.
   ఒక రోజు నేను రిసెప్షన్ కి వెళ్ళాను. అక్కడ అందరూ ఏదో ఒకటి తప్పకుండ ప్రదర్శించాలి అని పట్టుబట్టారు. నేను అందరికంటే చివర్లో కూర్చొని చూస్తున్నాను. ఏజ్  తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా.  నా లైన్ వస్తుంది. కాళ్ళు  వణుకుతున్నై. అంతలోనే ఆపేసారు. ఎవరో అమెరికా  అతిధి వస్తున్నారని. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. హమ్మయ్య  ఆగిపాయింది అనుకున్నాను. మామూలు మనిషినయ్యాను. 
   అంతలో ఆ వచ్చిన అతిధి కొన్ని కొత్త పాటలు పాడారు. నాకూ అవి రావు. ఇంతలో మైక్ పట్టుకొని "నాతొ సమానంగా ఎవరైన పాడేవాళ్ళు నాతొ జాయిన్ రావొచ్చు . ఒక్కడిని పాడితే బాగుండదు.ఎవరైన లేడీ రండి" అంటూ పాట బిగిన్ చేయబోయాడు. వెళ్లి పోదామనుకున్న దాన్నికాస్తా  ఆగిపోయాను. నాకు ఏదో తెలియని ఉత్సాహం వచ్చేసింది. ఏం పాటో అనుకున్నాను. దేవుడా నాకు తెలిసిన పాట ఐతే బాగుండు అనుకున్నాను. మళ్ళీ గుండె స్పీడ్ గా కొట్టుకుంటుంది. 16 స. తర్వాత కదా. కాళ్ళు మళ్ళీ వణుకుతున్నై. పాడాలనే కోరిక ఒక్కసారిగా బయటికి వచ్చింది.
        మ్యూజిక్ వినగానే నాకు తెలిసింది అది నాకు వచ్చే పాటే. "నన్ను దోచుకొందువటే" అని. ఇక వెనుక లైన్ నుండి నేను నడవలేదు. మీకు తెలుసు ముందుకు పరుగెత్తుకొని వచ్చానని. నా మనసు లోని కోరిక పురివిప్పింది. మనసుతీర అతనితో కలిసి పాడాను. ఇంకా ౩ పాటలు కూడా. అందరూ ఒకటే చప్పట్లు. అపార్ట్ మెంట్ వాళ్ళు పైన లైన్ కట్టి చూస్తున్నారు. చుట్టాలు అందరికీ సంతోషం. ఇన్ని రోజులు ఎక్కడ దాచావే నీ గానాన్ని అని.  మా వారు నివ్వెర పోయారు. ఏంటిరా మీ ఆవిడ ఇంత బాగా పాడుతుంటే ఎన్నడైనా చెప్పలేదు" అని ఎవరో అంటుంటే  "నాకూ ఇప్పుడే తెలుసు మామా " అంటున్నారు. 
 మా అత్తగారు. ఆడపడుచులు చాలా సంతోషపడ్డారు. పాడుతా తీయగా వెళ్ళు అన్నారు. కాని ఏజ్ చాలా వుంది వద్దు అన్నాను. 
 అలా నా కోరిక తీరింది. మర్చిపోలేను. 


Sunday, 24 April 2011

"నన్ను ఎందుకు కన్నావు అమ్మా?............"

         కంగారు పడకండి  అమ్మా.... తరువాత ఎండా కాలం సెలవుల్లో అని రాయాలి. అవును మా అమ్మాయి బర్త్ డే ఈ రోజు (ఏప్రిల్ 24 ). నిన్న సెకండ్ శో మిస్టర్ పర్ఫెక్ట్  వెళ్ళాము. కరక్ట్ గా 12 .౦౦.కి  విషెస్ చెప్పాము. oh ఒకటే ఆనందం. 
                 పిల్లలు బర్త్ డే అనగానే 1  సం.ముందునుండే దాని గురించి  ఆలోచిస్తారు. ఏమేం కొనుక్కోవాలి ఎలా తయారవ్వాలి, ఫంక్షన్ ఎట్లా జరుపుకోవాలి అని. నేను పెద్ద ఆర్భాటంగా ఏం చేయను. సింపుల్ గా నే చేస్తాను. పులిహోర,స్వీట్స్ , రెండు కూల్ డ్రింక్స్ బాటిల్స్  తను ఎంతమంది ఫ్రెండ్స్ ను పిలిస్తే అంతమందికి రడీ చేస్తాను. తర్వాత కేక్ షరా మామూలే కదా.
     కాని తిరకాసు ఎక్కడంటే  తను సెలవుల్లో పుట్టింది అదీ  కరక్ట్ గా  లాస్ట్ వర్కింగ్ డే కు తర్వాత. స్కూల్ తెరుస్తారు అనే ఆశ ఏ మాత్రం లేదు.ఏమీ తెల్వని రుజుల్ల్లో ఇంటిపక్కవాళ్ళతో కలిసి జరిపించేదాన్ని. తర్వాత నేను స్చూల్లో పంచుతాను  అనేసరికి కంగారు. సెలవులు కదా ఎలాగా అని. చాక్లెట్స్ పంచాలి కాబట్టి  విధి లేక 15 రోజుల  ముందే కొత్తబట్టలు వేసి చాక్లెట్స్ తో పంపించే దాన్ని.ఇంటివరకు తర్వాత చేసేదాన్ని. 
        ఇప్పుడు మాత్రం "నన్ను సెలవుల్లో ఎందుకు కన్నావు అమ్మా"అని అడుగుతుంది.  ఏం చెప్పాలి దానికి. 
"నా డేట్ కి ఏ స్పెషల్ కూడా లేదు" అని అంటుంటే ఎట్లాగో దొరికాడు సచిన్అతని బర్త్ డే ఇదేరోజు అని చెప్పాను. ఇక అప్పటి నుండి అందరికీ చెప్పడం "నాది, సచిన్ ది సేం  డే" అని. 
అప్పటి నుండి T .V లో సచిన్ కేక్ కోస్తుంటే ఇక్కడ ఈమె కేక్ కోయడం. సరదాగా గడిచి పోతుంది. దానికి సంతోషం ఆగాడు. ఫ్రెండ్స్ కి చూపిస్తుంది. థాంక్స్ సచిన్. కాని ఈరోజు సత్య సాయిబాబా చనిపోవడం చాలా బాధాకరం. ఐన సరే దాని కోసం ఫంక్షన్ చేద్దామనుకున్నా. కాని T .V. లో విజువల్స్ చూసి తను బర్త్ డే చేసుకోను అన్నది. నాకు కూడా ఆయన చనిపోవడం బాధ అయి వద్దనుకుంటున్నాను.
కాబట్టి ఇప్పటి  జనరేషన్ కు  చెప్పేది  ఏంటంటే  సెలవుల్లో  కనకండి.  లేదా ఆ  డేట్  కి  ఎదైనా  స్పెషల్  ఉందా కనుక్కోండి. లేకుంటే పిల్లలకి సమాధానం చెప్పలేము. ఓకే  బై .Thursday, 21 April 2011

"ఇంటర్ మార్క్స్ "(బాబోయ్ )

          వెబ్ సైట్ రెడీ గ వుంచాను. మా అమ్మాయి రిజల్ట్స్ కోసం. కరక్ట్ టైంకి ఓపెన్ చేసాను. చాలా  టెన్షన్తో. 444 /470 . ఇంకేముంది ఒకటే ఏడుపు. 455  రావాలట. ఆ మార్క్స్ చాల్లే అన్నా కూడా  ఇప్పుడు తక్కువ వస్తే ఎంసెట్ లో రాంక్ రాదమ్మా అంటూ ఏడుపు. ఫిసిక్స్ చాలా హార్డ్ గా వచ్చిందట. ఇంప్రూవ్ మెంట్ రాయమన్నాను. గంట తర్వాత  రూం నుండి బయటకు వచ్చింది. 
ఫ్రెండ్స్ కో ఫోన్ చేస్తే ఛాలా వరకు అందరికి దీనికంటే తక్కువ వచ్చాయి. ఎందుకు వాళ్ళ కి తక్కువ వచ్చాయమ్మా వాళ్ళు బాగా చదువుతారు  అంటది. నాకేమీ తెలుసురా అన్నాను. 
అందరు కంగ్రాట్స్ చెప్తుంటే కాస్త  తేరుకుంది. భగవంతునికి థాంక్స్ చెప్పుకున్నాము. సాయంత్రంగుడికి వెళ్ళాలి. 
ఇప్పుడే తన కోర్కెల చిట్టా విప్పుతుంది. వాచ్(ఇంకొకటి), గొలుసు( వేరేదీ ), డ్రెస్సు (ఇంకా, ఇంకా).......
హమ్మో పారిపోతున్నాను బాబోయ్.


 

Tuesday, 19 April 2011

దేవుడికి అంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు?

            అవును వేలు, కోట్లు వున్నవారు డబ్బులు దేవుడి హుండీ లో ఎందుకు వేసేది? అంత డబ్బు వున్నవారు మామూలుగా చాల విద్యావంతులై  కూడా వుంటారు.పోనీ ఆ డబ్బులు కూడా ఎవరికైనా సహాయ పడుతున్నాయా  అంటే అదీ తెలీదు. మధ్యలో మింగే వారు ఎందఱో!  "మానవ సేవే మాధవ సేవ" అని మన అందరికీ తెలుసు. 
కొంత మాత్రము దేవుడికి సమర్పించి మిగిలిన డబ్బు తో ఎందరికో జీవనోపాధిని కల్పించవచ్చు. కొన్ని కుటుంబాలకు ఆసరాగా ఉండొచ్చు. నిజాన్ని మీరే తెలుసుకొని వారికి సహాయాన్ని అందించండి. ఒక సంస్థను మీరే నడిపించి చాల మందికి  జీవనోపాధిని కల్పించి, చదువుకొని ఉద్యోగం లేని వారికి పనిని కల్పించండి. వారు మిమ్మల్ని రోజూ దేవునికంటే ఎక్కువగా తలచుకుంటారు. దేవులు మిమ్మల్ని చూసుకుంటారు. 
పేపర్లలో కిలోల కొద్దీ బంగారాన్నీ , కోట్లకొద్దీ డబ్బును సమర్పించే వారి గురించి చూసి  ఇది వ్రాస్తున్నాను. డబ్బు సార్ధకం యితేనే దానికి మంచి విలువ. పోనీ మీకు సంస్థను నడిపించే వీలు లేకపోతె, మంచిగా నడిచే సంస్థ ను గురించి తెలుసుకొని వారికి సహాయ కారులుగా వుండండి. దాన్ని ఇంకా వృద్ది చేయించండి. మినిమం సహాయం ఏంటంటే ఒక కుటుంబాన్ని ఏదైనా  ఒక మిషిన్ పోషించడానికి తోడ్పడుతుంది కదా . అవి కొని పంచండి. స్థోమత కొద్దీ ఇవ్వండి. ఎందఱో నోటికి అన్నం దొరుకుతుంది. సగం కడుపు నిండడానికైనా వస్తుంది కదా.
       రిటైర్ ఐన వారిని, బాధ్యతలు తీరి వూరికే ఇంట్లో వుండే మధ్య వయస్కులను, సహాయకారులు గా వుండే టీనేజ్ పిల్లలను, సలహాలను ఇచ్చే వారిని వినియోగించుకోవచ్చు. కాని స్వలాభాన్ని ఆశించి మాత్రం సహాయం చేయకండి. అందరికీ ఏదో ఒక వ్యపకాన్ని  కల్పించడం ద్వారా ఇంట్లో తగాదాలను కూడా నివారించవచ్చు. నష్టాలలోవున్న మంచి సంస్థ లకు ప్రాణం పోయండి. పని చేయడం వల్ల ప్రతిఫలం వచ్చేటట్టు చేయండి. మేధావుల సహాయం తీసుకోండి. 
           దేవుడి కి సమర్పించే డబ్బు ఏమాత్రం   వినియోగం కాకపోవడం మనం చాలా చూస్తున్నాము ఈ మధ్య పేపర్లలో కదా. వృధా కాని సహాయాన్ని మీదబ్బుతో మీరే అందించండి. మానవాళి అభివృద్దికి తోడ్పడండి. మనవ విలువలను కాపాడే బాధ్యత అందరిపైనా  వుంది. 
          ముందు తరాలవారిని దృష్టిలోపెట్టుకొని మనం మంచిగా నడచుకోవాలి. వారికి మంచి భవిష్యత్తును, మనవవిలువలను  బహుమతులు గా  అందించాలి. భవిష్యత్తు ఇప్పటికే అగమ్య గోచరంగా కన్పిస్తుంది. దాన్ని మనం కొంచమైన నివారించడానికి, మన ప్రయత్నం మనం కొంత అయినా  చేయాలి కదా. కాస్త  ఆలోచిస్తారు కదా.
  

"మా నాన్న బాగా గుర్తుకొస్తున్నారు"

             ఎందుకో మా నాన్న ఈ రోజు బాగా గుర్తుకు వస్తున్నారు. మా నాన్నను  (చిట్యాల  పంతంగి లక్ష్మి కాంతా రావు) నల్గొండ ఘంటసాల అనేవారట. మా నాన్న ఫ్రెండ్స్  చెప్పారు. నాన్న చాల బాగా పాడేవారు. బుల్బుల్, ఫ్లూట్ చాలా బాగా వాయించేవారు. " శిలలపై శిల్పాలు చెక్కినారు " పాడుతుంటే అబ్బ చెప్పలేను. ఇప్పడు కూడా  సాంగ్ వింటుంటే (తలచుకున్నా  కూడా) నాకు కళ్ళ నీళ్లు ఆగవు.'
సంగీతం నేర్చుకోలేదు. ఐన కూడా స్వరాలూ చాలా బాగా పలికేవారు..
ఆయన రచయిత కూడాను.అప్పట్లో  "ప్రజామత" లో ప్రింట్ అయ్యాయి. ఇంక చాల సరదాగా మాట్లాడేవారు. చుట్టూ 10 మంది ఖచ్చితంగా ఉండాల్సిందే. అందరి ముఖాల్లోనూ చిరునవ్వే. అంతగా నవ్వించేవారు. నేను నాన్న పోలిక మాత్రమే. సరదాతనం రాలేదు. అదే నాకు చాలా బాధగా వుంటది. "నీలా నేను ఎందుకు లేను నాన్న" అంటే. "నీకు వుండే ఒపికతనం  నాకు వోచ్చిన్దారా? దేవుడు ఎలా పుట్టించారో అలా మనం వుండాల్సిందే. మార్చలేమురా " అనేవారు.
గాయనీ గాయకుల గురించీ, వారు పాడే విధానం గురించీ చెప్పేవారు. చాల చిన్నతనం లోనే నాకు  హిందీ ఆర్టిస్ట్ ల పేర్లు అందరివీ వచ్చు. ఇప్పుడు పాత హిందీ పాటలు వింటుంటే నాన్న బాగా గుర్తుకు వస్తారు. యాభై మూడవ ఏటనే చనిపోయారు. నాన్న అమ్మకు రాసిన ఉత్తరాలలో ఎంత ప్రేమ కన్పిస్తుందో. ఇప్పటికీ మా అమ్మ వాటిని చాల భద్రంగా దాచుకుంది. నాన్న చనిపోయాక ( 53 వ ఏట 1992 లో)  మాకు చూపించింది.
భోగి రోజు మల్లెపూవులాంటి లాల్చీ పైజమా తో అందరికి రాత్రి గుళ్ళో కనబడి,  తెల్లారి 6 గంటలకు చనిపోవడం అందరినీ  చాలా బాధించింది.

నాన్న తలుపు ఆధారంగా చేసుకొని మ్యూజిక్ వేసేవారు. అది ఏ పాటో నేను తక్కువ టైం లో చెప్పాలి. అలా నేను చెప్పగానే ఎంత సంతోషించేవారో. నాకు సుశీల పాటలు చాలా వచ్చు. నా న్న నేర్పించారు. " ఆకులో ఆకునై"అనే పాట నాకు చాలా ప్రైజ్ లను తెచ్చిపెట్టింది. నాన్న, నేను కలిసి పోటీ పడి పాడేవారం ఇంట్లో మరియు ఫంక్షన్లలో.
విజయశాంతి ఆక్టర్ ని చాల ఇష్టపడేవారు. తన birthday (జూన్), అమెది కూడా అదే రోజు అనుకుంటాను. లేదా 24 డేట్ అనుకుంట ఏదో మరి ఇద్దరిది ఒకటే. 
తాతయ్య  గార్వం (అమ్మమ్మ భర్త )నాకు లేదు. మా పిల్లలకు లేదు. అది కూడా నాకు బాధ. ఇప్పుడు నాన్న ఏజ్ వాళ్ళను చూస్తుంటే నాన్న ఇంకా వుంటే బాగుండేది అన్పిస్తుంది. మా చిన్న అమ్మాయి మా నాన్న పోలిక. మా వారు దాన్ని "మామగారు" అంటారు సరదాగా.
  
నేను ఇప్పుడు నాన్న, మా అక్క, నేను చదివిన డిగ్రీ కాలేజ్ లోనే job చేస్తున్నాను. మా నాన్న తిరిగిన,చదివిన, పాడిన కాలేజ్." ఈ గాలి ఈ నెల అని రోజూ అనుకుంటూ వెళ్తాను". అమెరికాలో వున్న వారు చాలా ఏండ్ల కు ఇండియా వచ్చినంత ఫీలింగ్ రోజూ కూడా నాకు. 
ముద్దపప్పు బొగ్గుల పొయ్యి మీద చెయ్యడం, నీళ్ళ  చారు, వంకాయ కూర ఇంకా సొరకాయ, బీరకాయ, వంకాయ నిప్పుల్లో వేసి కాల్చుకొని నెయ్యి తో , చింతకాయ పచ్చడిలో వేసుకొని తినడం నాన్నకు చాలా ఇష్టం. ఆ పనులు నేను చేసేదాన్ని. నన్ను చిన్నోడు చిన్నోడు అని పిల్చేవారు. 

"మీ అమ్మను కుర్చీల మధ్యలో నుండి చూపించారురా. నేను కూర్చొని ఉందేమో అనుకున్నాను. కానీ నిలబడి వుందట. నేను అలా మోసపోయాను"  అని నవ్వించేవారు. పెళ్లి చూపులు అయ్యాక ఒక సంవత్సరానికి చేసుకున్నారట పెళ్లి ఆ రోజుల్లో. అంత ప్రేమ మా అమ్మ అంటే నాన్నకు. అమ్మ కుర్చీలో కూర్చుంటే కాళ్ళు నెలకు అందవు వేలాడుతుంటాయి. . కాస్త పొట్టి. "మీ అమ్మ కాళ్ళ ను చాలా ఈజీ గా  దులుపు కోవచ్చురా." అనేవారు. ఇంకా ఎన్ని జ్ఞాపకాలో.
Tuesday, 12 April 2011

బ్లౌజ్ కుట్టడం నేర్చుకోండి ఇలా

                 బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ. కాస్తంత  క్రియేటివిటీ  వుండాలి. కాస్త ఓపిక వుండాలి. చీర కొన్నప్పుడల్లా బ్లౌజ్ కు ఖర్చు పెట్టాలంటే హమ్మో అని కాస్త బాధ. నాకే కనుక స్టిచ్చింగ్  వచ్చుంటే ఈ 200 రూపాయలు మిగిలేవి కదా అనుకుంటాను. కానీ మళ్లి టైలర్ దగ్గరికి వెళ్ళడం 200 సమర్పయామి. బ్లౌజ్ ఒక్కటి ఎవరైనా  నేర్పిస్తే 1000 రూపాయలు (అది కూడా అన్నిటి కంటే చివరికి నేర్పిస్తారు.) మిషిన్ అనవసరంగా వుండడం చాలా ఇండ్లల్లో చూసాను. దానిలో కాస్త ఆయిల్ పోసి చాల జాగ్రత్తగా వాడండి. కొందరికి అదే జీవనోపాధి.
            ఒకరి ఇంట్లో ఎంబ్రాయిడరీ   వాడకం లేక తుప్పుపట్టడం చూసి నాకు ఎలాగో అన్పించింది.   సరే ఇక ఎలా కుట్టాలో చిన్న కిటుకు మాత్రమే ఇది. మిషిన్ ఉన్నవారికి మాత్రమే. చెప్పాక ఛీ ఇలాన అనుకోకండి. కాస్త ఆలోచించండి అంతే. చాల మంది ఉన్న ఇంట్లో ఇలా అవసరమే కదా. ఒక్క బ్లౌజ్  మాత్రమే కాదు. ఏవైనా కూడాను.
          చాలా బాగా కుదిరిన ఒక పాత బ్లౌజ్ యొక్క కుట్లు అన్ని ఓపికగా తీసివేసి, బాగా దులిపి, ఒకసారి స్టార్చ్ పెట్టి అన్నీ ఆంటే రెండు చేతులు, ముందు వెనుక భాగాలు, జాయింట్ చేసే ముక్కలు విడి విడిగా ఆరవేసిన తర్వాత ఐరన్
చేసి పెట్టుకోవాలి.
         కాస్త ఓపిక గా ఒక పేపర్ మీద వేసి  అదేవిధంగా కట్ చేసుకొని దాన్ని భద్రంగా దాచిపెట్టుకోవాలి. ముందు ముందు ఉపయోగించుకోవచ్చు. మీరు కుట్టుకోవలనుకొనే బ్లౌజ్ పీస్ మీద పెట్టి చాల జాగ్రత్తగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. 
1 లేదా 2  చెడిపోవచ్చు. కానీ ౩ వది  కుదురుతుంది కదా. సిటీ లలో స్టిచింగ్ చ్చార్జేస్ ఎక్కువ. సో కాస్త ఓపిక, కాస్త 
క్రియేటివిటీ వుండాలి అంతే. ప్రయత్నం చేయండి.

Sunday, 10 April 2011

అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు.

అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు.అందరు మా వూరికి (నల్గొండ) కు తప్పకుండా రండి.కళ్యాణం చాలా చాలా బాగా జరుగుతుంది.గుళ్ళోనే  అందరమూ భోజనాలు చెయ్యాలి. ఇబ్బంది ఏమీ వుండదు. రాత్రి కూడా ఇక్కడ ఉండేటట్లు చూసుకోండి. బాండు  మేళం వాళ్ళు ఎంత మంచి పాటలు మనకు అందిస్తారంటే అది మన గుండెలను తాకుతుంటే కళ్ళనుండి నీళ్ళు  కారుతాయి. మనసెరిగిన వాడు  మా దేవుడు, సీతారాముల కళ్యాణం చూతము రారండి,
అని ఇంకా ఛాలా పాటలు వింటుంటే  ఆ ఆనందం చెప్పలేనిది. ఈసారీ వాతావరణం కూడా చల్లగా ఆహ్లాదంగా వుంది. సో అందరు తప్పక రండి.  ఇది నా ఫస్ట్ పోస్ట్. తప్పులుంటే క్షమించండి. దీన్ని మోడిఫై  ఎలా చేయాలో నాకు తెలవట్లేదు. ముందు ముందు ట్రై చేస్తాను. బై