mee ishtam. enthaina sampaadinchandi

massiveptr.com

Tuesday, 19 April 2011

"మా నాన్న బాగా గుర్తుకొస్తున్నారు"

             ఎందుకో మా నాన్న ఈ రోజు బాగా గుర్తుకు వస్తున్నారు. మా నాన్నను  (చిట్యాల  పంతంగి లక్ష్మి కాంతా రావు) నల్గొండ ఘంటసాల అనేవారట. మా నాన్న ఫ్రెండ్స్  చెప్పారు. నాన్న చాల బాగా పాడేవారు. బుల్బుల్, ఫ్లూట్ చాలా బాగా వాయించేవారు. " శిలలపై శిల్పాలు చెక్కినారు " పాడుతుంటే అబ్బ చెప్పలేను. ఇప్పడు కూడా  సాంగ్ వింటుంటే (తలచుకున్నా  కూడా) నాకు కళ్ళ నీళ్లు ఆగవు.'
సంగీతం నేర్చుకోలేదు. ఐన కూడా స్వరాలూ చాలా బాగా పలికేవారు..
ఆయన రచయిత కూడాను.అప్పట్లో  "ప్రజామత" లో ప్రింట్ అయ్యాయి. ఇంక చాల సరదాగా మాట్లాడేవారు. చుట్టూ 10 మంది ఖచ్చితంగా ఉండాల్సిందే. అందరి ముఖాల్లోనూ చిరునవ్వే. అంతగా నవ్వించేవారు. నేను నాన్న పోలిక మాత్రమే. సరదాతనం రాలేదు. అదే నాకు చాలా బాధగా వుంటది. "నీలా నేను ఎందుకు లేను నాన్న" అంటే. "నీకు వుండే ఒపికతనం  నాకు వోచ్చిన్దారా? దేవుడు ఎలా పుట్టించారో అలా మనం వుండాల్సిందే. మార్చలేమురా " అనేవారు.
గాయనీ గాయకుల గురించీ, వారు పాడే విధానం గురించీ చెప్పేవారు. చాల చిన్నతనం లోనే నాకు  హిందీ ఆర్టిస్ట్ ల పేర్లు అందరివీ వచ్చు. ఇప్పుడు పాత హిందీ పాటలు వింటుంటే నాన్న బాగా గుర్తుకు వస్తారు. యాభై మూడవ ఏటనే చనిపోయారు. నాన్న అమ్మకు రాసిన ఉత్తరాలలో ఎంత ప్రేమ కన్పిస్తుందో. ఇప్పటికీ మా అమ్మ వాటిని చాల భద్రంగా దాచుకుంది. నాన్న చనిపోయాక ( 53 వ ఏట 1992 లో)  మాకు చూపించింది.
భోగి రోజు మల్లెపూవులాంటి లాల్చీ పైజమా తో అందరికి రాత్రి గుళ్ళో కనబడి,  తెల్లారి 6 గంటలకు చనిపోవడం అందరినీ  చాలా బాధించింది.

నాన్న తలుపు ఆధారంగా చేసుకొని మ్యూజిక్ వేసేవారు. అది ఏ పాటో నేను తక్కువ టైం లో చెప్పాలి. అలా నేను చెప్పగానే ఎంత సంతోషించేవారో. నాకు సుశీల పాటలు చాలా వచ్చు. నా న్న నేర్పించారు. " ఆకులో ఆకునై"అనే పాట నాకు చాలా ప్రైజ్ లను తెచ్చిపెట్టింది. నాన్న, నేను కలిసి పోటీ పడి పాడేవారం ఇంట్లో మరియు ఫంక్షన్లలో.
విజయశాంతి ఆక్టర్ ని చాల ఇష్టపడేవారు. తన birthday (జూన్), అమెది కూడా అదే రోజు అనుకుంటాను. లేదా 24 డేట్ అనుకుంట ఏదో మరి ఇద్దరిది ఒకటే. 
తాతయ్య  గార్వం (అమ్మమ్మ భర్త )నాకు లేదు. మా పిల్లలకు లేదు. అది కూడా నాకు బాధ. ఇప్పుడు నాన్న ఏజ్ వాళ్ళను చూస్తుంటే నాన్న ఇంకా వుంటే బాగుండేది అన్పిస్తుంది. మా చిన్న అమ్మాయి మా నాన్న పోలిక. మా వారు దాన్ని "మామగారు" అంటారు సరదాగా.
  
నేను ఇప్పుడు నాన్న, మా అక్క, నేను చదివిన డిగ్రీ కాలేజ్ లోనే job చేస్తున్నాను. మా నాన్న తిరిగిన,చదివిన, పాడిన కాలేజ్." ఈ గాలి ఈ నెల అని రోజూ అనుకుంటూ వెళ్తాను". అమెరికాలో వున్న వారు చాలా ఏండ్ల కు ఇండియా వచ్చినంత ఫీలింగ్ రోజూ కూడా నాకు. 
ముద్దపప్పు బొగ్గుల పొయ్యి మీద చెయ్యడం, నీళ్ళ  చారు, వంకాయ కూర ఇంకా సొరకాయ, బీరకాయ, వంకాయ నిప్పుల్లో వేసి కాల్చుకొని నెయ్యి తో , చింతకాయ పచ్చడిలో వేసుకొని తినడం నాన్నకు చాలా ఇష్టం. ఆ పనులు నేను చేసేదాన్ని. నన్ను చిన్నోడు చిన్నోడు అని పిల్చేవారు. 

"మీ అమ్మను కుర్చీల మధ్యలో నుండి చూపించారురా. నేను కూర్చొని ఉందేమో అనుకున్నాను. కానీ నిలబడి వుందట. నేను అలా మోసపోయాను"  అని నవ్వించేవారు. పెళ్లి చూపులు అయ్యాక ఒక సంవత్సరానికి చేసుకున్నారట పెళ్లి ఆ రోజుల్లో. అంత ప్రేమ మా అమ్మ అంటే నాన్నకు. అమ్మ కుర్చీలో కూర్చుంటే కాళ్ళు నెలకు అందవు వేలాడుతుంటాయి. . కాస్త పొట్టి. "మీ అమ్మ కాళ్ళ ను చాలా ఈజీ గా  దులుపు కోవచ్చురా." అనేవారు. ఇంకా ఎన్ని జ్ఞాపకాలో.
3 comments:

 1. sweet memories.
  పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు!

  ReplyDelete
 2. మీ నాన్నగారి జ్ఞాపకాలు బావున్నాయి.

  ReplyDelete
 3. బాగా చెప్పారు..

  ReplyDelete