mee ishtam. enthaina sampaadinchandi

massiveptr.com

Sunday, 10 April 2011

అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు.

అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు.అందరు మా వూరికి (నల్గొండ) కు తప్పకుండా రండి.కళ్యాణం చాలా చాలా బాగా జరుగుతుంది.గుళ్ళోనే  అందరమూ భోజనాలు చెయ్యాలి. ఇబ్బంది ఏమీ వుండదు. రాత్రి కూడా ఇక్కడ ఉండేటట్లు చూసుకోండి. బాండు  మేళం వాళ్ళు ఎంత మంచి పాటలు మనకు అందిస్తారంటే అది మన గుండెలను తాకుతుంటే కళ్ళనుండి నీళ్ళు  కారుతాయి. మనసెరిగిన వాడు  మా దేవుడు, సీతారాముల కళ్యాణం చూతము రారండి,
అని ఇంకా ఛాలా పాటలు వింటుంటే  ఆ ఆనందం చెప్పలేనిది. ఈసారీ వాతావరణం కూడా చల్లగా ఆహ్లాదంగా వుంది. సో అందరు తప్పక రండి.  ఇది నా ఫస్ట్ పోస్ట్. తప్పులుంటే క్షమించండి. దీన్ని మోడిఫై  ఎలా చేయాలో నాకు తెలవట్లేదు. ముందు ముందు ట్రై చేస్తాను. బై

2 comments:

  1. బాగుందండి మీ బ్లాగు. మీకు కూడా శుభాకాంక్షలు. వ్యాఖ్య రాసిన వారికి మీరు జవాబివ్వాలి అనుకుంటే వేరే టపాగా రాయనక్కరలేదు. మీ జవాబుని ఆ టపా కామెంట్ బాక్స్‌లో రాసి పోస్ట్ చేస్తే సరిపోతుంది. మీరెండవ బ్లాగులో వేరే టపా రూపంలో జవాబిచ్చారు కదా. అది చూసి చెప్తున్నాను. మీ బ్లాగింగ్‌ నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  2. బ్లాగ్లోకానికి స్వాగతం

    ReplyDelete