mee ishtam. enthaina sampaadinchandi

massiveptr.com

Sunday, 24 April 2011

"నన్ను ఎందుకు కన్నావు అమ్మా?............"

         కంగారు పడకండి  అమ్మా.... తరువాత ఎండా కాలం సెలవుల్లో అని రాయాలి. అవును మా అమ్మాయి బర్త్ డే ఈ రోజు (ఏప్రిల్ 24 ). నిన్న సెకండ్ శో మిస్టర్ పర్ఫెక్ట్  వెళ్ళాము. కరక్ట్ గా 12 .౦౦.కి  విషెస్ చెప్పాము. oh ఒకటే ఆనందం. 
                 పిల్లలు బర్త్ డే అనగానే 1  సం.ముందునుండే దాని గురించి  ఆలోచిస్తారు. ఏమేం కొనుక్కోవాలి ఎలా తయారవ్వాలి, ఫంక్షన్ ఎట్లా జరుపుకోవాలి అని. నేను పెద్ద ఆర్భాటంగా ఏం చేయను. సింపుల్ గా నే చేస్తాను. పులిహోర,స్వీట్స్ , రెండు కూల్ డ్రింక్స్ బాటిల్స్  తను ఎంతమంది ఫ్రెండ్స్ ను పిలిస్తే అంతమందికి రడీ చేస్తాను. తర్వాత కేక్ షరా మామూలే కదా.
     కాని తిరకాసు ఎక్కడంటే  తను సెలవుల్లో పుట్టింది అదీ  కరక్ట్ గా  లాస్ట్ వర్కింగ్ డే కు తర్వాత. స్కూల్ తెరుస్తారు అనే ఆశ ఏ మాత్రం లేదు.ఏమీ తెల్వని రుజుల్ల్లో ఇంటిపక్కవాళ్ళతో కలిసి జరిపించేదాన్ని. తర్వాత నేను స్చూల్లో పంచుతాను  అనేసరికి కంగారు. సెలవులు కదా ఎలాగా అని. చాక్లెట్స్ పంచాలి కాబట్టి  విధి లేక 15 రోజుల  ముందే కొత్తబట్టలు వేసి చాక్లెట్స్ తో పంపించే దాన్ని.ఇంటివరకు తర్వాత చేసేదాన్ని. 
        ఇప్పుడు మాత్రం "నన్ను సెలవుల్లో ఎందుకు కన్నావు అమ్మా"అని అడుగుతుంది.  ఏం చెప్పాలి దానికి. 
"నా డేట్ కి ఏ స్పెషల్ కూడా లేదు" అని అంటుంటే ఎట్లాగో దొరికాడు సచిన్అతని బర్త్ డే ఇదేరోజు అని చెప్పాను. ఇక అప్పటి నుండి అందరికీ చెప్పడం "నాది, సచిన్ ది సేం  డే" అని. 
అప్పటి నుండి T .V లో సచిన్ కేక్ కోస్తుంటే ఇక్కడ ఈమె కేక్ కోయడం. సరదాగా గడిచి పోతుంది. దానికి సంతోషం ఆగాడు. ఫ్రెండ్స్ కి చూపిస్తుంది. థాంక్స్ సచిన్. కాని ఈరోజు సత్య సాయిబాబా చనిపోవడం చాలా బాధాకరం. ఐన సరే దాని కోసం ఫంక్షన్ చేద్దామనుకున్నా. కాని T .V. లో విజువల్స్ చూసి తను బర్త్ డే చేసుకోను అన్నది. నాకు కూడా ఆయన చనిపోవడం బాధ అయి వద్దనుకుంటున్నాను.
కాబట్టి ఇప్పటి  జనరేషన్ కు  చెప్పేది  ఏంటంటే  సెలవుల్లో  కనకండి.  లేదా ఆ  డేట్  కి  ఎదైనా  స్పెషల్  ఉందా కనుక్కోండి. లేకుంటే పిల్లలకి సమాధానం చెప్పలేము. ఓకే  బై .







Thursday, 21 April 2011

"ఇంటర్ మార్క్స్ "(బాబోయ్ )

          వెబ్ సైట్ రెడీ గ వుంచాను. మా అమ్మాయి రిజల్ట్స్ కోసం. కరక్ట్ టైంకి ఓపెన్ చేసాను. చాలా  టెన్షన్తో. 444 /470 . ఇంకేముంది ఒకటే ఏడుపు. 455  రావాలట. ఆ మార్క్స్ చాల్లే అన్నా కూడా  ఇప్పుడు తక్కువ వస్తే ఎంసెట్ లో రాంక్ రాదమ్మా అంటూ ఏడుపు. ఫిసిక్స్ చాలా హార్డ్ గా వచ్చిందట. ఇంప్రూవ్ మెంట్ రాయమన్నాను. గంట తర్వాత  రూం నుండి బయటకు వచ్చింది. 
ఫ్రెండ్స్ కో ఫోన్ చేస్తే ఛాలా వరకు అందరికి దీనికంటే తక్కువ వచ్చాయి. ఎందుకు వాళ్ళ కి తక్కువ వచ్చాయమ్మా వాళ్ళు బాగా చదువుతారు  అంటది. నాకేమీ తెలుసురా అన్నాను. 
అందరు కంగ్రాట్స్ చెప్తుంటే కాస్త  తేరుకుంది. భగవంతునికి థాంక్స్ చెప్పుకున్నాము. సాయంత్రంగుడికి వెళ్ళాలి. 
ఇప్పుడే తన కోర్కెల చిట్టా విప్పుతుంది. వాచ్(ఇంకొకటి), గొలుసు( వేరేదీ ), డ్రెస్సు (ఇంకా, ఇంకా).......
హమ్మో పారిపోతున్నాను బాబోయ్.


 

Tuesday, 19 April 2011

దేవుడికి అంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు?

            అవును వేలు, కోట్లు వున్నవారు డబ్బులు దేవుడి హుండీ లో ఎందుకు వేసేది? అంత డబ్బు వున్నవారు మామూలుగా చాల విద్యావంతులై  కూడా వుంటారు.పోనీ ఆ డబ్బులు కూడా ఎవరికైనా సహాయ పడుతున్నాయా  అంటే అదీ తెలీదు. మధ్యలో మింగే వారు ఎందఱో!  "మానవ సేవే మాధవ సేవ" అని మన అందరికీ తెలుసు. 
కొంత మాత్రము దేవుడికి సమర్పించి మిగిలిన డబ్బు తో ఎందరికో జీవనోపాధిని కల్పించవచ్చు. కొన్ని కుటుంబాలకు ఆసరాగా ఉండొచ్చు. నిజాన్ని మీరే తెలుసుకొని వారికి సహాయాన్ని అందించండి. ఒక సంస్థను మీరే నడిపించి చాల మందికి  జీవనోపాధిని కల్పించి, చదువుకొని ఉద్యోగం లేని వారికి పనిని కల్పించండి. వారు మిమ్మల్ని రోజూ దేవునికంటే ఎక్కువగా తలచుకుంటారు. దేవులు మిమ్మల్ని చూసుకుంటారు. 
పేపర్లలో కిలోల కొద్దీ బంగారాన్నీ , కోట్లకొద్దీ డబ్బును సమర్పించే వారి గురించి చూసి  ఇది వ్రాస్తున్నాను. డబ్బు సార్ధకం యితేనే దానికి మంచి విలువ. పోనీ మీకు సంస్థను నడిపించే వీలు లేకపోతె, మంచిగా నడిచే సంస్థ ను గురించి తెలుసుకొని వారికి సహాయ కారులుగా వుండండి. దాన్ని ఇంకా వృద్ది చేయించండి. మినిమం సహాయం ఏంటంటే ఒక కుటుంబాన్ని ఏదైనా  ఒక మిషిన్ పోషించడానికి తోడ్పడుతుంది కదా . అవి కొని పంచండి. స్థోమత కొద్దీ ఇవ్వండి. ఎందఱో నోటికి అన్నం దొరుకుతుంది. సగం కడుపు నిండడానికైనా వస్తుంది కదా.
       రిటైర్ ఐన వారిని, బాధ్యతలు తీరి వూరికే ఇంట్లో వుండే మధ్య వయస్కులను, సహాయకారులు గా వుండే టీనేజ్ పిల్లలను, సలహాలను ఇచ్చే వారిని వినియోగించుకోవచ్చు. కాని స్వలాభాన్ని ఆశించి మాత్రం సహాయం చేయకండి. అందరికీ ఏదో ఒక వ్యపకాన్ని  కల్పించడం ద్వారా ఇంట్లో తగాదాలను కూడా నివారించవచ్చు. నష్టాలలోవున్న మంచి సంస్థ లకు ప్రాణం పోయండి. పని చేయడం వల్ల ప్రతిఫలం వచ్చేటట్టు చేయండి. మేధావుల సహాయం తీసుకోండి. 
           దేవుడి కి సమర్పించే డబ్బు ఏమాత్రం   వినియోగం కాకపోవడం మనం చాలా చూస్తున్నాము ఈ మధ్య పేపర్లలో కదా. వృధా కాని సహాయాన్ని మీదబ్బుతో మీరే అందించండి. మానవాళి అభివృద్దికి తోడ్పడండి. మనవ విలువలను కాపాడే బాధ్యత అందరిపైనా  వుంది. 
          ముందు తరాలవారిని దృష్టిలోపెట్టుకొని మనం మంచిగా నడచుకోవాలి. వారికి మంచి భవిష్యత్తును, మనవవిలువలను  బహుమతులు గా  అందించాలి. భవిష్యత్తు ఇప్పటికే అగమ్య గోచరంగా కన్పిస్తుంది. దాన్ని మనం కొంచమైన నివారించడానికి, మన ప్రయత్నం మనం కొంత అయినా  చేయాలి కదా. కాస్త  ఆలోచిస్తారు కదా.