వెబ్ సైట్ రెడీ గ వుంచాను. మా అమ్మాయి రిజల్ట్స్ కోసం. కరక్ట్ టైంకి ఓపెన్ చేసాను. చాలా టెన్షన్తో. 444 /470 . ఇంకేముంది ఒకటే ఏడుపు. 455 రావాలట. ఆ మార్క్స్ చాల్లే అన్నా కూడా ఇప్పుడు తక్కువ వస్తే ఎంసెట్ లో రాంక్ రాదమ్మా అంటూ ఏడుపు. ఫిసిక్స్ చాలా హార్డ్ గా వచ్చిందట. ఇంప్రూవ్ మెంట్ రాయమన్నాను. గంట తర్వాత రూం నుండి బయటకు వచ్చింది.
ఫ్రెండ్స్ కో ఫోన్ చేస్తే ఛాలా వరకు అందరికి దీనికంటే తక్కువ వచ్చాయి. ఎందుకు వాళ్ళ కి తక్కువ వచ్చాయమ్మా వాళ్ళు బాగా చదువుతారు అంటది. నాకేమీ తెలుసురా అన్నాను.
అందరు కంగ్రాట్స్ చెప్తుంటే కాస్త తేరుకుంది. భగవంతునికి థాంక్స్ చెప్పుకున్నాము. సాయంత్రంగుడికి వెళ్ళాలి.
ఇప్పుడే తన కోర్కెల చిట్టా విప్పుతుంది. వాచ్(ఇంకొకటి), గొలుసు( వేరేదీ ), డ్రెస్సు (ఇంకా, ఇంకా).......
హమ్మో పారిపోతున్నాను బాబోయ్.
No comments:
Post a Comment