కంగారు పడకండి అమ్మా.... తరువాత ఎండా కాలం సెలవుల్లో అని రాయాలి. అవును మా అమ్మాయి బర్త్ డే ఈ రోజు (ఏప్రిల్ 24 ). నిన్న సెకండ్ శో మిస్టర్ పర్ఫెక్ట్ వెళ్ళాము. కరక్ట్ గా 12 .౦౦.కి విషెస్ చెప్పాము. oh ఒకటే ఆనందం.
పిల్లలు బర్త్ డే అనగానే 1 సం.ముందునుండే దాని గురించి ఆలోచిస్తారు. ఏమేం కొనుక్కోవాలి ఎలా తయారవ్వాలి, ఫంక్షన్ ఎట్లా జరుపుకోవాలి అని. నేను పెద్ద ఆర్భాటంగా ఏం చేయను. సింపుల్ గా నే చేస్తాను. పులిహోర,స్వీట్స్ , రెండు కూల్ డ్రింక్స్ బాటిల్స్ తను ఎంతమంది ఫ్రెండ్స్ ను పిలిస్తే అంతమందికి రడీ చేస్తాను. తర్వాత కేక్ షరా మామూలే కదా.

కాని తిరకాసు ఎక్కడంటే తను సెలవుల్లో పుట్టింది అదీ కరక్ట్ గా లాస్ట్ వర్కింగ్ డే కు తర్వాత. స్కూల్ తెరుస్తారు అనే ఆశ ఏ మాత్రం లేదు.ఏమీ తెల్వని రుజుల్ల్లో ఇంటిపక్కవాళ్ళతో కలిసి జరిపించేదాన్ని. తర్వాత నేను స్చూల్లో పంచుతాను అనేసరికి కంగారు. సెలవులు కదా ఎలాగా అని. చాక్లెట్స్ పంచాలి కాబట్టి విధి లేక 15 రోజుల ముందే కొత్తబట్టలు వేసి చాక్లెట్స్ తో పంపించే దాన్ని.ఇంటివరకు తర్వాత చేసేదాన్ని.
ఇప్పుడు మాత్రం "నన్ను సెలవుల్లో ఎందుకు కన్నావు అమ్మా"అని అడుగుతుంది. ఏం చెప్పాలి దానికి.
"నా డేట్ కి ఏ స్పెషల్ కూడా లేదు" అని అంటుంటే ఎట్లాగో దొరికాడు సచిన్. అతని బర్త్ డే ఇదేరోజు అని చెప్పాను. ఇక అప్పటి నుండి అందరికీ చెప్పడం "నాది, సచిన్ ది సేం డే" అని.
"నా డేట్ కి ఏ స్పెషల్ కూడా లేదు" అని అంటుంటే ఎట్లాగో దొరికాడు సచిన్. అతని బర్త్ డే ఇదేరోజు అని చెప్పాను. ఇక అప్పటి నుండి అందరికీ చెప్పడం "నాది, సచిన్ ది సేం డే" అని.
అప్పటి నుండి T .V లో సచిన్ కేక్ కోస్తుంటే ఇక్కడ ఈమె కేక్ కోయడం. సరదాగా గడిచి పోతుంది. దానికి సంతోషం ఆగాడు. ఫ్రెండ్స్ కి చూపిస్తుంది. థాంక్స్ సచిన్. కాని ఈరోజు సత్య సాయిబాబా చనిపోవడం చాలా బాధాకరం. ఐన సరే దాని కోసం ఫంక్షన్ చేద్దామనుకున్నా. కాని T .V. లో విజువల్స్ చూసి తను బర్త్ డే చేసుకోను అన్నది. నాకు కూడా ఆయన చనిపోవడం బాధ అయి వద్దనుకుంటున్నాను.
కాబట్టి ఇప్పటి జనరేషన్ కు చెప్పేది ఏంటంటే సెలవుల్లో కనకండి. లేదా ఆ డేట్ కి ఎదైనా స్పెషల్ ఉందా కనుక్కోండి. లేకుంటే పిల్లలకి సమాధానం చెప్పలేము. ఓకే బై .
"నన్ను ఎందుకు కన్నావు అమ్మా?..."కంగారు పడకండి అమ్మా.... తరువాత ఎండా కాలం సెలవుల్లో"
ReplyDeleteచాలా బాగుందండీ...
నిజంగానే కంగారుపడ్డాను టైటిల్ చూసి...
మీ అమ్మాయికి చాలా లేట్ గా HappyBirthDay...