mee ishtam. enthaina sampaadinchandi

massiveptr.com

Tuesday, 19 April 2011

దేవుడికి అంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు?

            అవును వేలు, కోట్లు వున్నవారు డబ్బులు దేవుడి హుండీ లో ఎందుకు వేసేది? అంత డబ్బు వున్నవారు మామూలుగా చాల విద్యావంతులై  కూడా వుంటారు.పోనీ ఆ డబ్బులు కూడా ఎవరికైనా సహాయ పడుతున్నాయా  అంటే అదీ తెలీదు. మధ్యలో మింగే వారు ఎందఱో!  "మానవ సేవే మాధవ సేవ" అని మన అందరికీ తెలుసు. 
కొంత మాత్రము దేవుడికి సమర్పించి మిగిలిన డబ్బు తో ఎందరికో జీవనోపాధిని కల్పించవచ్చు. కొన్ని కుటుంబాలకు ఆసరాగా ఉండొచ్చు. నిజాన్ని మీరే తెలుసుకొని వారికి సహాయాన్ని అందించండి. ఒక సంస్థను మీరే నడిపించి చాల మందికి  జీవనోపాధిని కల్పించి, చదువుకొని ఉద్యోగం లేని వారికి పనిని కల్పించండి. వారు మిమ్మల్ని రోజూ దేవునికంటే ఎక్కువగా తలచుకుంటారు. దేవులు మిమ్మల్ని చూసుకుంటారు. 
పేపర్లలో కిలోల కొద్దీ బంగారాన్నీ , కోట్లకొద్దీ డబ్బును సమర్పించే వారి గురించి చూసి  ఇది వ్రాస్తున్నాను. డబ్బు సార్ధకం యితేనే దానికి మంచి విలువ. పోనీ మీకు సంస్థను నడిపించే వీలు లేకపోతె, మంచిగా నడిచే సంస్థ ను గురించి తెలుసుకొని వారికి సహాయ కారులుగా వుండండి. దాన్ని ఇంకా వృద్ది చేయించండి. మినిమం సహాయం ఏంటంటే ఒక కుటుంబాన్ని ఏదైనా  ఒక మిషిన్ పోషించడానికి తోడ్పడుతుంది కదా . అవి కొని పంచండి. స్థోమత కొద్దీ ఇవ్వండి. ఎందఱో నోటికి అన్నం దొరుకుతుంది. సగం కడుపు నిండడానికైనా వస్తుంది కదా.
       రిటైర్ ఐన వారిని, బాధ్యతలు తీరి వూరికే ఇంట్లో వుండే మధ్య వయస్కులను, సహాయకారులు గా వుండే టీనేజ్ పిల్లలను, సలహాలను ఇచ్చే వారిని వినియోగించుకోవచ్చు. కాని స్వలాభాన్ని ఆశించి మాత్రం సహాయం చేయకండి. అందరికీ ఏదో ఒక వ్యపకాన్ని  కల్పించడం ద్వారా ఇంట్లో తగాదాలను కూడా నివారించవచ్చు. నష్టాలలోవున్న మంచి సంస్థ లకు ప్రాణం పోయండి. పని చేయడం వల్ల ప్రతిఫలం వచ్చేటట్టు చేయండి. మేధావుల సహాయం తీసుకోండి. 
           దేవుడి కి సమర్పించే డబ్బు ఏమాత్రం   వినియోగం కాకపోవడం మనం చాలా చూస్తున్నాము ఈ మధ్య పేపర్లలో కదా. వృధా కాని సహాయాన్ని మీదబ్బుతో మీరే అందించండి. మానవాళి అభివృద్దికి తోడ్పడండి. మనవ విలువలను కాపాడే బాధ్యత అందరిపైనా  వుంది. 
          ముందు తరాలవారిని దృష్టిలోపెట్టుకొని మనం మంచిగా నడచుకోవాలి. వారికి మంచి భవిష్యత్తును, మనవవిలువలను  బహుమతులు గా  అందించాలి. భవిష్యత్తు ఇప్పటికే అగమ్య గోచరంగా కన్పిస్తుంది. దాన్ని మనం కొంచమైన నివారించడానికి, మన ప్రయత్నం మనం కొంత అయినా  చేయాలి కదా. కాస్త  ఆలోచిస్తారు కదా.
  

No comments:

Post a Comment