ఐ కాన్ ఐ కాన్ ఐ కాన్ ఐ కాన్ అనుకోవడం నాకు చాల ఇష్టం. దాన్ని ఎల్లవేళలా ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంటాను. అలా అనుకొని పనులు చేసుకోవడం మా వారికి చాల తీరకను కల్గించింది. నాకు ఆత్మవిశ్వాసాన్ని, కాస్త నష్టాన్ని కూడా కల్గిస్తుంది.
"జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బాధ్యతా యుతంగా వుండడం నాకు ఇష్టం. "
ఎలా అంటే చిన్నప్పటినుండి నాకు మాత్స్ అంటే పిచ్చి ఇష్టం. నా ఇంటరెస్ట్ ను గమనించి మా గురువులు నన్ను ఇంజినీర్ చేయమని చెప్పేవారు. కానీ బి.పి.సి తీసుకోవడం తో రాంగ్ రూట్ ఐపోయింది.
కానీ నా మెకానిజం ను ఇంట్లో ఉపయోగిస్తుంటాను అప్పుడప్పుడు. ఇంట్లో వుండే ప్రతి ఆడవారు ఇలా చేసుకోవడం తప్పనిసరి. మెదడుకు పదును, ఖర్చులు మిగులుతాయి. చిన్నపనికి మెకానిక్ ను పిలవాలంటే వాళ్ళు టైం కి రారు, మరియు వారి ఇష్టం వచ్చినట్లు డబ్బులు అడుగుతారు.
గ్యాస్ స్టవ్ చెడిపోతే నేనే బాగు చేసుకుంటాను పూర్తిగా.
గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడం కూడా చాలామంది చేసుకోరు. (అనుకుంటాను.)
fuse పొతే ఎవ్వరినీ పిలవను. నేనే చేసుకుంటాను. మెయిన్ ఆఫ్ చేస్తాను. వైర్ చుట్టేసి సాకెట్ లో పెట్టేస్తాను.
గ్రైండర్ చెడిపోతే బాగు చేసుకుంటాను. (పెద్ద ఎత్తున ఐతే షాప్ కే)
రైస్ కుకర్ కూడానూ.
ఇంట్లో నల్లాలు లీక్ అవుతుంటే పాతవి తీసేసి. కొత్త వాచర్ మరియు కొత్త టాప్ లు కూడా బిగిన్చేస్తాను.
వాల్ క్లాక్స్ బాగుచేస్తుంటాను.
ఫాన్స్, హీటర్, బల్బ్ కనెక్షన్స్ చేస్తుంటాను.
ఇక బయటి పనులు కూడా ఎన్ని ఉంటాయో మీకు తెలుసు కదా అవన్నీ ఒక్కదాన్ని చేసుకుంటాను. (చాలామంది చేసుకుంటారు లెండి అంటారేమో)
బాడ్మింటన్, కారంస్ బాగా ఆడతాను. ఎప్పుడు కూడా చాల ఉత్సాహంగా ఉండడానికి ప్రత్నిస్తుంటాను.
చాల కష్టమైనా పనిని చిన్నగా ఎలా చేయవచ్చో ఆలోచిస్తూ ఉండి, ఆ విధంగా చేస్తాను.
కుట్టు మిషిన్ కొత్తగా వచ్చినప్పుడు దాన్ని నేనే 10 వ తరగతిలో బిగించాను.
మా వారి ప్యాంటు జేబులు చినిగి పోతూ వుంటే వాటిని మంచి దట్టమైన కాటన్ క్లోత్ తో మళ్ళీ కుట్టేస్తాను.
బటన్స్, కాజాలు ఇవన్నీ మామూలే.
వంటింట్లో నల్ల ఒక మూలకు స్టవ్ ఇంకొక మూలకు వుంటై కదా. అప్పుడు నల్ల నుండి స్టవ్ దాక ఒక పైప్ పెట్టుకొని గ్యాస్ స్టవ్ ను కడుగోతూ ఎప్పుడు కూడా నీట్ గ ఉంచుకోవచ్చు.
నల్ల సంపులో నీళ్ళు చాలా ఉండి పొతే దాని లోని పైప్ బయటికి తీయకపోతే నీళ్లన్నీ లాగేసుకుంటాయి కదా. ఆ పైప్ చివరికి ఒక తర్మకోల్ ని కట్టేస్తే అది పైకి తేలుతుంది. అప్పుడు సంపులోని నీళ్ళు ఇంకిపోవు. నీళ్ళు ఎక్కువ కావాలి అంటే మాత్రం దాని కిందికి వేసి గమనించాల్సిందే నండి.
అందరికీ మీకు సహాయంగా నేనున్నాను అనేటట్టు ఉండడానికి ప్రయత్నిస్తుంటాను. ( చేయగలవి మాత్రమే ) మాట సహాయం కూడా కొందరికి ధైర్యాన్ని ఇస్తుందని నా అభిప్రాయం.
ప్రతి ఫంక్షన్ కి అటెండ్ అవుతాను. నేను రాలేదు అంటే నాకు ఏదో పని తగిలింది అని అందరికీ తెలుసు. అందుకని ఎవరూ ఏమీ అనుకోరు.
మొబైల్ ను నాకు ఉపయోగంగా వాడుకుంటాను. అలారం, రిమైండర్, SMS లు తప్పకుండా పంపిస్తాను. ఈ రోజుల్లో ప్రయాణాలు తక్కువయ్యాయి కదా .
బర్త్ డే అందరివీ ఆ రోజుకి 5 సం దాకా రిమైండర్ లో ఉంచేస్తాను.
ఒక్క పూజలు, గుడి కెల్లడం మరియు సాహిత్యం లో మాత్రం ఇంటరెస్ట్ కలగడం లేదు.
గుడికి వెళ్తే మాత్రం మనస్ఫూర్తిగా ఒక 1 గం. ఐన కూర్చుంటాను.
ఇక నాకు నష్టం ఏంటంటే మా వారు ఆఫీస్ పనులతో బిజీ ఇపోవడం వలన అప్పట్లో పనులన్నీ ఆయనకు చెప్పకుండా చేసుకున్నాను. ఇప్పుడేమో నీకు అన్నీ వచ్చుకదా ఇంకా మెకానిక్ ఎందుకు అంటారు. ఏమండీ ఏమండీ అని ప్రాధేయ పడకుండా చేసుకున్నాను. ఖర్మ. ఏమీ పనులు చేయకుండా ఐపోయారు.
మీరు మాత్రం అలా చేయకండి. మగవారికి పనులు చెప్పడం కూడా చేయండి.
వుంటాను. మీ అభిప్రాయాలను తప్పకుండా చెప్పండి. బై
మీరు నిజముగా మల్టీ టాలెంటెడ్ పర్సన్ అండీ.. చాలా మంది కన్నా మీరు నయం. నీచ నికృష్ట టీవీ సీరియల్లల్లో మునిగిపోక బాగా మీ అభిరుచులు పెంచుకున్నారు. మీకు ప్రత్యెక అభినందనలు.
ReplyDeleteవర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండి. దానివల్ల కామెంట్స్ వ్రాసేవారికి ఇబ్బంది కాని మీకు కాదు.