ఎక్కడినుండి మొదలుపెట్టాలి మ్....మ్....మ్
సరే...........మా గృహ ప్రవేశం ఫంక్షన్ ఐపోయాక,మేము కొత్త ఇంట్లో కి సామాను చేరుస్తున్నాము. ప్రతి ఐటెం ను చెక్ చేసి కొత్త ఇంటికి పంపిస్తున్నాను. నేను పాత ఇంట్లో జాగ్రత్తగా అన్ని చూస్తున్నాను. అవసరం లేనివి ఒక వైపు కుప్పగా పేర్చాను. తర్వాత నన్ను కొత్త ఇంట్లోకి పంపారు సర్దాలని. అన్ని వస్తున్నై వాన్ లో. అన్ని సర్ది పెట్టించాను.
ఈలోగా మా మన్చాలు మరియు పరుపులు వచ్చాయి. నా గుండె గుభేల్ అన్నది. హమ్మో నా సర్టిఫికెట్స్ పరుపుల కింద పెట్టినట్టు నాకు గుర్తు. లేక ఒక వైట్ కవరు లో ఎక్కడో పెట్టినట్టు మరో గుర్తు. సరే ఇంట్లో అందరూ ఉన్నారుగా చెక్ చేస్తారు లే అనుకున్నాను. ఈ లోగ నా వైట్ కవరు కూడా వచ్చినట్టుంది. మావారు నాకు చెప్తూ " చిన్నీ నీ వైట్ కవరు కూడా వచ్చేసింది" అన్నారు. హమ్మయ్య అనుకున్నాను. అందరం కొత్త ఇంట్లో హాయిగా ఎంజాయ్ చేస్తూ వున్నాము. ఒకానొక రోజున..........
ఈలోగా మా మన్చాలు మరియు పరుపులు వచ్చాయి. నా గుండె గుభేల్ అన్నది. హమ్మో నా సర్టిఫికెట్స్ పరుపుల కింద పెట్టినట్టు నాకు గుర్తు. లేక ఒక వైట్ కవరు లో ఎక్కడో పెట్టినట్టు మరో గుర్తు. సరే ఇంట్లో అందరూ ఉన్నారుగా చెక్ చేస్తారు లే అనుకున్నాను. ఈ లోగ నా వైట్ కవరు కూడా వచ్చినట్టుంది. మావారు నాకు చెప్తూ " చిన్నీ నీ వైట్ కవరు కూడా వచ్చేసింది" అన్నారు. హమ్మయ్య అనుకున్నాను. అందరం కొత్త ఇంట్లో హాయిగా ఎంజాయ్ చేస్తూ వున్నాము. ఒకానొక రోజున..........
దాదాపు 15 రోజుల తర్వాత నాకు ఒక ఇంటర్వ్యు కాల్ వచ్చింది. ఇంటర్వ్యు వుందని, సర్టిఫికెట్స్ తీసుకురమ్మని కవర్ పంపారు. నేను మా వారిని అడిగాను " ఏమండీ నా సర్టిఫికెట్స్ కవరు ఎక్కడ పెట్టారు?" అని.
"బీరువా లో "అన్నారు. ఆఫీస్ కు వెళ్లారు.
బీరువాలో ఒక్కొక్క షెల్ఫ్ చూస్తున్నాను. అదులో నేను అనుకున్నవైట్ కవరు కు బదులు గా వేరే వైట్ కవరు వుంది. నా గుండె అతి వేగంగా కొట్టుకుంటుంది. అందులో వేరే పేపర్స్ ఉన్నవి. దేవుడా..అనుకుంటూ ......... గబుక్కున మావారికి ఫోన్ చేసాను. అదే కవర్ అని చెప్పారు. నా గుండె కిందికి జారింది.సర్టిఫికెట్స్ కవరు లేదు.
హమ్మో ఇప్పుడు ఎట్లా? నా కష్టార్జితాలు. నా టెన్త్. ఇంటర్, డిగ్రీ సర్టిఫి. బాబోయ్ . పి. జి చేయాలనుకున్నాను. ఇంకా ఎన్నో. అన్ని చోట్లా వెదికాను. అందరినీ అడిగాను. లాభం లేదు. నాకు తల తిరిగిపోతుంది. చదువుకోని దానిలా కనబడుతున్నాను.
హమ్మో ఇప్పుడు ఎట్లా? నా కష్టార్జితాలు. నా టెన్త్. ఇంటర్, డిగ్రీ సర్టిఫి. బాబోయ్ . పి. జి చేయాలనుకున్నాను. ఇంకా ఎన్నో. అన్ని చోట్లా వెదికాను. అందరినీ అడిగాను. లాభం లేదు. నాకు తల తిరిగిపోతుంది. చదువుకోని దానిలా కనబడుతున్నాను.
పాత ఇంటివాళ్ళకి ఫోన్ చేసాను. వాళ్ళు వున్నారా వూరికి వెళ్ళారా అని. ఉన్నారట. జెట్ స్పీడ్తో పాత ఇంటికి వెళ్ళాను. మిట్ట మధ్యాహ్నం ఐంది. సర్టిఫికే ట్స్ గురించి చెప్పాను. అందరు ఏమో అన్నారు. చెత్త అంతా మూల కు వున్న పెద్ద బావిలో వేసారు మీరు. అక్కడ చూడండి అన్నారు.
వేగంగా పరుగెత్తాను. బావి చాలా లోతుగా వుంది. చెత్తా చెదారం వున్నై. అందులోకి చూసాను. ఎన్నో కవర్లు వున్నాయి అందులో ఏదో అర్థం కాలేదు. ఎలారా భగవంతుడా అనుకొని చుట్టూ చూసాను. బావి లోతు కర్ర దొరుకుతుందా అని. ఎక్కడా లేదు. అందరినీ అడిగాను. ఎవ్వరూ లేదన్నారు. మిద్దె మీదికి వెళ్ళాను. మొత్తం చూసాను.
ఒక అటక మీద కర్ర కనబడుతుంది. కాని నాకు అందడం లేదు. ఒక తాడు తీసుకున్నాను. దాన్ని ముడి వేసి కర్రకు విసిరాను. మెడలు లాగుతున్నై. 3 వ సారి దానికి పట్టుకుంది. కిందికి లాగాను. దేవుడా దేవుడా అనుకుంటూ చూద్దును కదా అది సరిగ్గా బావిలోతు వున్న వెదురు కర్ర. దేవుడా నీకు వేయి నమస్కారాలు.
దాని చివరికి ఒక సీలను కొట్టాను. కవరు వుంటే పట్టి లాగొచ్చు అని. తొందరగా బావి దగ్గరికి వెళ్లాను. మళ్ళీ చీకటి పడితే బావిలో ఏమీ కనబడదు. అందరూ (పిల్లలు, పెద్ద ఆడవాళ్ళు) నా వెనకాల వచ్చారు. బావిలోకి కర్రను పోనిచ్చాను. చెత్త జరుపుతూ కవర్లు చూస్తున్నాను. ఒక్కొక్క కవరు ను తీస్తూ పోయాను. అందులో తడి చెత్త పొడి చెత్త 15 రోజుల క్రితం నుండి కదా అన్నీ వున్నై. చేతులు నొప్పి పెడుతున్నాయి. మగ వాళ్ళు ఎవ్వరూ లేరు.
గంట ప్రయత్నించగా ఒక బ్లాక్ కవరు కింద వున్న వైట్ కవరు కనబడింది. దాన్ని సీలకు పట్టిచ్చి పైకి లాగాను. ఎలుకలు తిన్నట్టు గా ఉన్న నా కవరు కనబడింది. పైకి తీశాను. అవే. దేవుడా నీకు పదివేల నమస్కారాలు స్వామి. సర్టిఫికెట్స్ లామినేషన్ తో వున్నై కదా మూలలు మాత్రం ఎలుకలు తిన్నాయి.అందరూ నా అదృష్టం బాగుంది కాబట్టే అవి దొరికాయి అని అంటుంటే దొరికిందే చాలని మళ్ళీ కొత్త ఇంటికి పరుగెత్తాను. దేవుడికి దండం పెట్టుకున్నాను. అవి వుండడం వల్ల నేను ఇప్పటికి ఒక 5 సం నుండి 3 లక్షలు సంపాదించాను. లేకపోతె ఏం జరిగేదో.
ఇంకొక కొస మెరుపు ఏంటంటే ఏంటంటే ఏంటంటే........ నేను సరిఫికేత్స్ తెచ్చిన రోజు సాయంత్రం కుండపోతగా ఒకటే వర్షం. ఇప్పటికీ నేను చాలా ఆశ్చర్యపోయే సంఘటన ఇది. మీకు ఎలాగ వుందో నాకు రాస్తారు కదా. బై.
రాయాలన్న మీ తపన బాగుంది.
ReplyDeleteబాగుంది
ReplyDeleteహమ్మో మీ టపా చదువుతుంటే నాకు గుండె కొంచెం కిందకి జారినట్టయ్యింది. అదృష్టం బాగుండి దొరికాయి. మన పత్రాలని చూసి తప్ప మన చదువుకి విలువే లేదు! నేను కూడా నా certificates అన్నిటికీ ఇప్పుడే frame కట్టించేస్తాను. ఇప్పటినించీ జాగ్రత్త పడాలి.
ReplyDeleteరసగ్న్య గారు జాగ్రత్త పడ్డారన్నమాట.
ReplyDelete