అవును ఎవ్వరింట్లో నైనా ఒకటే చప్పుడు టక టక టక టక టక టక టక టక టక అని. ఏమి చప్పుడు అంటారా?
అదే నండి రొట్టెలు (కొందరు చపాతీలు అంటారనుకుంటాను ) చేస్తుంటే వచ్చే చప్పుడు.
దానికి ఒక చిన్న ఉపాయం. అందరికీ తెలుసేమో.
నేనూ నా ప్రయత్నం చేస్తాను.
రొట్టెల పిండి కాస్త నూనె, కాస్త సాల్ట్ తో కలిపాక బాగా నానిన తర్వాతనే చేస్తే బాగుంటాయి. పెనం మీద వేసిన తర్వాతా కాస్త నెమ్మది గా పొంగేలా మాత్రమే ప్రెస్ చేయాలి సలాకి తో. అప్పుడు పొంగుతాయి. తర్వాత నూనెను వేసి లేక వేయక పోయినా పరవాలేదు.
పిండి తో చేస్తే ( తాల్చడం), కాస్త ఎక్కవ పిండి వేస్తె చపాతీ చేయడం తొందరగా అవుతుంది. కాని తర్వాత దాని మీద వున్న పిండిని తప్పకుండా బట్టతో తుడిచివేసిన తర్వాతనే పెనం మీద వేయాలి. చపాతీ మెత్తగా చేయవచ్చు. లేకపోతే పై పొర గట్టిగా వస్తుంది. కొందరికి చపాతీ గట్టిగా తినడమే ఇష్టం అనుకోండి.
చపాతీ లు అన్ని ఒక సారి చేసాక (తాల్చడం) పెనం మీద కాల్వడం చేస్తారు చాలా మంది. అలాకాకుండా రెండు లేదా మూడు చేసిపెట్టుకున్నాక పేపర్ మీద విడి విడి గా వేసాక మాత్రమే చపాతి కాల్వాలి. అప్పుడు చాలా బాగా వస్తాయి.
చపాతి చేసేటప్పుడు పీట మీద అటు ఇటు చాల సార్లు తిప్పడం చేస్తారు. నాకు వచ్చిన (గొప్పేం కాదు లెండి) విద్య ఏంటంటే నేను చపాతి, పీట నిండా అయ్యేదాకా అస్సలు తిప్పను. మీరూ ప్రయత్నించండి. చూద్దాం.
పెనం మీద వేసాక మాత్రం తిప్పాలండి కాస్త ప్రెస్ చేస్తూ. .
ఇక అసలు విషయం ఏంటంటే ( ఇది మీకూ తెలుసులెండి ) చపాతి పీట, లాటి చప్పుడు కాకూడదు అంటే కింద కాస్త బట్టను పరిచి దాని మీద పీటను పెట్టి చేస్తే రొట్టెలు చేస్తే చప్పుడు అస్సలు రాదు. ఇతరులకు ఇబ్బంది కాదు. నాకు ఆ చప్పుడు అంటే చాలా విసుగు మరి.
ఇంకొక విషయం ఏంటంటే కొందరి ఇంట్లో నల్లాలు చాల ప్రెషర్ తో వాటర్ వస్తుంటాయి. వంటిల్లు అంతా చిమ్మి తడి తడి గా అవుతుంది. ప్లాట్ఫాం అంతా తడుస్తుంటుంది కదా. అటువంటప్పుడు. నల్లాకు కాస్త చిన్న క్లాత్ ని హాండిల్ కిందు గా కట్టాలి. అటువంటప్పుడు ప్రెషర్ వచ్చినా కూడా చిమ్మదు ఇంటినిండా.
మీరేమంటారు మరి.

No comments:
Post a Comment