ఒకప్పుడు నాకు మొహమాటం చాల ఎక్కువ. ఇప్పుడు కాస్త తగ్గింది కాని పూర్తిగా కాదు. ఒక రకంగా నన్ను అందరూ ఉపయోగించుకుంటారు. నాకు అర్థం అవుతుంది కాని " ఎదుటివాళ్ళను వీలైనంత క్షమించడం నా బలహీనత."
"పని చేయలేను", "చేయను"," తర్వాత చేస్తాను" అని చెప్పడానికి నేను ఇబ్బంది పడతాను. సరే ఇదంతా ఎందుకంటే మొహమాటం, బెరుకు వల్లే నేను, మా అక్క, మా నాన్న చదువుకున్న మా వూరి డిగ్రీ కాలేజ్ కి 10 yrs వరకు వెళ్ళలేక పోయాను.
నా డిగ్రీ ఐపోయాక పెళ్లి, సంసారం . రోజులు గడుస్తున్నై. నేను చదువుకున్న కాలేజ్ కి వెళ్లి ఆ రూం లు అన్ని ఒకసారి చూడాలి అనుకొనేదాన్ని. కాని ధైర్యం చేయలేక పోయాను. నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ వుండరు. ఎవరిపనిలో వాళ్ళు వుంటారు. ఇతరులు రావొద్దు అని అంటారేమో అని భయం. కాని ఎలా ఎలా ఎలా వెళ్ళాలి. నాకు తోడు ఎవరూ లేరు. క్లాస్మేట్స్ అంతా ఎక్కడో సెటిల్ అయ్యారు. జ్ఞ్యాపకాలు క్లాస్మేట్స్ తో పంచుకుంటేనే బాగుంటాయి.
ఒకరోజు సండే పేపర్ లో అదే కాలేజ్ కి కంపూటర్ నాలెడ్జ్ వున్న ఆడవారు కావలెను(టెంపరరీ) అని వచ్చింది. టైం కరక్ట్ గా 9 .00 a .m అయ్యింది. ఫోన్ చేసాను. 9 .30 a .m రమ్మన్నారు. గబా గబా తయారయ్యాను. ఆటో తీసుకొని సర్టిఫికెట్స్ జీరాక్స్ తీయించుకొని వెళ్ళాను. పిన్ చేయలేదు వాటికి. నా దగ్గర వున్న పిన్నీస్ పెట్టాను. ఎలాగో అనిపించింది. కాని పని జరగాలి కదా. అది ముఖ్యం.
కరక్ట్ గా 9 .30 a .m అయ్యింది. నాకంటే ముందు ఇంకా 10 మంది వున్నారు. వాళ్ళు కొత్తగా డిగ్రీ చదివారేమో యంగ్ గా వున్నారు. నేనేమో 8 yrs పెద్ద. గోవిందా అనుకుంటున్నాను. జాబ్ పేరుతో నా కాలేజ్ కి వచ్చాను చాలు అనుకొని కాలేజ్ మొత్తం తిరిగాను మెల్లగా. మా నాన్న చదువుకొనే రోజుల్లో పాడే "శిలలపై శిల్పాలు చెక్కినారు" అనే పాట నా చెవుల్లో మోగుతుంది. (నేను చూడలేదు మా నాన్న చెప్పారు). మా అక్క పాడిన"ఇది మల్లెల వేళయనీ" పాట, నేను డి.జి.పి. ఎ.కే.ఖాన్ గారితో ఫస్ట్ ప్రైజ్ అందుకున్న " ఆకులో ఆకునై " పాటలు కూడా. గాలిలో తేలినంత ఆనందం. చెప్పలేను.
ఇంటర్వ్యు నా వంతు వచ్చింది. అన్నీ అడిగారు. జీరాక్స్ పేపర్స్ చూసారు. మరీ పిన్నీసు కూడాను . నవ్వి "పిన్ పంచ్ లేదట సర్ షాపులో" అన్నాను. తను కూడా నవ్వి ఊరుకున్నారు. మెమో చూసారు. "ఈ కాలేజ్ లోనే చదివావా అమ్మా?" అన్నారు. "అవును సర్" అన్నాను. సంతోష పడ్డారు. అక్కడే నాకు తెలిసిన ఇద్దరు లెక్చెరర్స్ ను విష్ చేసాను. నా రైటింగ్ చూసారు. లెటర్ వ్రాయమన్నారు. ఇంకా చాల అడిగారు. ఫోన్ చేస్తామన్నారు. ౩ డేస్ కు ఫోన్ చేసారు.
అప్పటికే నేను 2 ఆఫీస్ లలో చేయడం, మహిళను కావడం, అదే కాలేజ్ లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవడం, ప్రిన్సిపాల్ కు లెటర్ చాల బాగా వ్రాయడం, నా రైటింగ్, నా ఎలిజిబిలిటీస్ అన్నీ చూసారు. వచ్చిన అందరూ నాకంటే చదువులో ఎక్కువే వున్నారు. కాని ఎంట్రెన్స్ లని, పెళ్ళిళ్ళు అని మధ్యలో వెళ్తారు అని తీసుకోలేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎవ్వరికీ కూడా తెలుగు లో లెటర్ పధ్ధతి గా వ్రాయడం తెలీక పోవడం పెద్ద ఆశ్చర్యం. పోనీ ఇంగ్లీష్ లో కూడా వ్రాయలేక పోయారు.
నేను సెలెక్ట్ అయ్యాను. నన్ను ఉదయం 8 గంటల నుండి రమ్మన్నారు. హమ్మో నా వంట, నా పిల్లలు, ఇంట్లో పనులు, మా వారు నా కళ్ళముందు మెదిలారు. అంత తొందరగా నేను రాను సర్ అన్నాను. 9 .30 a .m . నుండి వస్తాను అన్నాను. చాల బతిమిలాడారు. సరే అని ఒప్పుకున్నాను. అలా 4 ఇయర్స్ చేసాను. ప్రతిరోజూ కొత్తే. ఒక్కనాడు కూడా సెలవు పెట్టలేదు. ఇష్టమైన పని. ఇష్టమైన కాలేజ్. ఇంకేముంది. స్టూడెంట్స్ నాతో మంచిగా బిహేవ్ చేసేవారు. లెక్చరర్స్ తో సమానమైన మర్యాదలు. స్టూడెంట్స్ పార్టీలు, ఇదే సమయమని నేను కూడా నా పాటల యుద్ధం మొదలు పెట్టాను.(పాటలంటే నాకు చాల ఇష్టమని బ్లాగ్ లలో రాసాను.)
"దేవుడా నా కోరిక తీర్చావు స్వామీ" అనుకోని సందర్భం లేదు. దేవుడు దారి ఎలా చూపెట్టాడు అని నాకు ఎంతో ఆశ్చర్యంగా వుంటుంది. జాబ్ చేస్తూనే టైపింగ్ తెలుగు, హిందీ, టాలీ నేర్చుకున్నాను. ఇంగ్లీష్ ముందే వచ్చు చాలా ఫాస్ట్ గా చేస్తాను.
(పండ్లువున్నచెట్టుకే రాళ్లు అన్నారుగా. నాకు పని భారం ఎక్కువవ్వడం వల్ల, మొహమాటం వల్ల , "నో" అని చెప్పకపోవడం వల్ల, సాలరీ పెంచకపోవడం వల్ల అలసి పోయి జాబ్ వదిలేసాను. )

job satisfaction అనేది చాలా ముఖ్యమండీ! మొత్తానికి మీరు కోరుకున్నది మీరు సాధించారు! ఇక్కడ అసందర్భామేమో కాని నాకు విల్లేజ్లో వినాయకుడు అనే సినిమాలో నచ్చిన dialogue: I am soldier by chance but you are teacher by choice!
ReplyDeleteNice experience though.
ReplyDeleteVery true, Many graduates these days can't write a coherent paragraph either in English or Telugu. Very sad state of education.