mee ishtam. enthaina sampaadinchandi

massiveptr.com

Monday, 13 June 2011

చదివి ఎవరైనా సలహా ఇవ్వండి, త్వరగా. టైం లేదు

నాకు చాల రోజులనుండి తల పగిలిపోతుంది ఆలోచించి. నా ప్రోబ్లం  ఏంటంటే నేను ఒక జాబ్  చేస్తున్నాను మూడు సం. నుండి.౩,600 /- లకి. సాలరీ 400 పెరుగొచ్చు అనుకుంటాను. నాతో ఇంకా ౩ చేస్తారు సెం సాలరీ తో. నేను అక్కడ  ఇంకా టైపింగ్ (తెలుగు,హిందీ,ఇంగ్లీష్,సంస్కృతం, మాథ్స్ , నోటరీ ) కూడా చేస్తాను. వారికి అవి రావు. బాధ్యతలు నాకే ఎక్కువ . సర్ కు నా పని మీద డౌట్ లేదు. జాబ్  టైమింగ్స్ ఉ.10 .30 టు స.4 .౩౦. వరకు. చాల బాగుంది. నాకు ఒక 1 ,౦౦౦ . పెరిగితే బాగుండు అనుకున్నాను. కాని పెరగదు. కాబట్టి నేను సొంతంగా జీరాక్స్  పెట్టుకోవాలని వుంది. పెట్టుకొమ్మంటారా? నాకు మాథ్స్, ఇంగ్లిష్ ట్యూషన్ చెప్పాలని వుంది. 
       జీరాక్స్ మిషన్ రడీ గ వుంది. కాని జాబ్ వదులుకోవాలి. జీరాక్స్ తో నేను  సంపాదించగలనా అని నా డౌట్. 
జాబ్ కి బుధ వారం దాకా టైం వుంది. నాకు సాలరీ 7 ,౦౦౦/- కావాలని వుంది. ఏం చేస్తే బాగుంటుంది?
మా వారు నీ ఇష్టం ఏదైతే అది చేయి అంటున్నారు. మీరు ఏమంటారు?

 

2 comments:

  1. సేవలకి.. తగిన ప్రతిఫలం ఆశించడం తప్పు కాదు. అందులోనూ..మీరు.. బహుముఖ ప్రజ్ఞాశాలులు. ఒక సారి.. మీరు.. ఎంత సేలరీ కోరుకుంటున్నారో.. మీ బాస్ కి..చెప్పి.. చూడండి.. కాదంటే.. ఒక్క సారి.. ఆలోచించి.. మంచి.. నిర్ణయం తో.. ముందు అడుగు వేయండి.. ఆత్మవిశ్వాసం దన్నుగా.. క్రొత్త బాట..పట్టండి.. ఫలితాలు..వెంటనే రాకున్న నిరాశ పడవద్దు. ఓపికతో.. చేయండి.. యు ఆర్ సక్సెస్..100%

    ReplyDelete
  2. మీరు బహుముఖ ప్రజ్ఞాశాలులు. అందుకు మీరు అభినందనీయులు.. ముందుగా మీ బాస్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు - ఈ విషయం గురించి సామ్యముగా, సావధానముగా చెప్పి చూడండి. మీరు ఎందుకు ఎక్కువగా కోరుకుంటున్నారు, మీలోని ప్రతిభ ఏమిటో చూచాయగా ప్రస్తావించండి. మీరు అనుకున్నట్లుగా Rs. 7000/- ఇవ్వక పోవచ్చును. కాని అత్యధికముగా 4,500 - 5,000 వరకూ పెరగవచ్చును.

    మీవి చాలా ఫ్లెక్సీ, అనుకూల సమయం కాబట్టి, మిగిలిన సమయములో ఏదైనా జాబు వర్క్ చెయ్యటం నేర్చుకోండి.. చెయ్యండి. మీరు బ్లవుజులు కుట్టగలరు కాబట్టి రోజుకి మూడు కుట్టుకున్నా మీ లెక్కన ఆరువందలు వస్తాయి.. అంటే నెలకి (600*30) Rs. 18,000 రూపాయలు ఇలా సంపాదించగలరు. అందులో సగం వచ్చినా Rs. 9,000 గ్యారంటీ అన్నమాట.

    లేదా మీకొచ్చిన జాబ్ వర్క్స్ ఇంటి ముందు ఒక బోర్డ్ పెట్టుకొని, మీ సిస్టం మీద రెండు మూడు గంటలు చెయ్యండి. అదీ బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు చేస్తున్న పని వల్ల గంటకి Rs. 19-44 Ps. సంపాదిస్తున్నారు. (Rs. 3500 / 30 రోజులు / రోజుకి 6 గంటలు ). ఈరోజుల్లో ఒక పేజి తెలుగు DTP కి Rs. 40 ; ఇంగ్లీష్ కి Rs. 25 తీసుకుంటున్నారని విన్నాను. ఆ లెక్కన చూస్తే - మీరు ఇలా చెయ్యటం ఉత్తమం. ఆ చుట్టుప్రక్కల న్యాయవాదులు ఎవరైనా ఉంటే వారిని అడిగితే - మీకు బోల్డంత పని. పావుగంటలో ఒక పేజి టైపు చేయ్యోచ్చును. ఆ సంగతి మీకు తెలుసు.

    పనిలో పనిగా జిరాక్స్ మెషీన్, జాకేట్స్ పనీ మొదలు పెట్టారంటే - ఇంకా బాగుంటుంది. పనిలో పనిగా ఒక జెనరేటర్ కూడా కొన్నారంటే మీ బిజినెస్స్ ఇంకా బాగుంటుంది. వీటికి తగిన మొత్తం సమకూర్చుకోనేదాకా అలాగే కంటిన్యూ అయిపోయి.. ఆ తరవాత ఇలా మీ కాళ్ళ మీద మీరు నిలబడటం బాగుంటుంది అని నా అభిప్రాయం.

    అప్పుడు మీరు అనుకున్న Rs. 7,000 కాదు మూడు రెట్లు ఎక్కువగా Rs. 20,000 ని తేలికగా ఈజీగా సంపాదించగలరు..

    ReplyDelete