mee ishtam. enthaina sampaadinchandi

massiveptr.com

Friday, 30 December 2011

****ఇంతలా**** నేను ****ఎప్పుడూ****వణకలేదు.****(మీకు చదివే ఓపిక ఉందా? అని టెస్ట్ కూడా )

మా ఆయన తరఫు వారి పెళ్లి.
ఆయన తరఫైతే ఆఫీస్ లీవ్ ఈసీగా దొరుకుతుంది. నా తరఫైతే మాత్రం  అస్సలు దొరకదు. కాంపులు  అంటారు.  అస్సలు వెళ్లొద్దు  పెళ్ళికి. నా పుట్టింటి తరఫున ఏదైనా ఫంక్షన్ ఐతే నీవు వెళ్ళు అంటారు. అదే ఆయన తరపున ఐతే వెళ్దాం. వెళ్తే  మాట దక్కుతుంది అంటారు. వారి తరపున కదా. ఈసారి నేను చాలా పట్టుదల గా వున్నాను వెళ్ళవద్దని.   ఎలాగైనా సరే నేనే నెగ్గాలి. నేను పోనంటే పోను అని నిర్ణయించుకున్నాను.

           స్కూల్ నుండి వస్తూ టైలర్ దగ్గరినుండి చీర తెచ్చింది నా కూతురు. హబ్బ ఎంత బాగుందో. పాచ్ వర్క్. క్రీం కలర్ కి మెరూన్ కలర్ బార్డర్. చాల బాగుంది. ఎప్పుడు కట్టుకోవాలో అని కాలండర్ చూస్తున్నాను............మా వారు ఇంట్లోనే వున్నారు. నన్ను బతిమిలాడడానికి రడీ అవుతున్నారు రమ్మని.
"ఈ సారికి రా చిన్నీ. పెళ్ళిలో అందరూ నిన్ను అడుగుతారు. బాగుండదు. "

" మరి  నావాళ్ళు  నన్ను  అడగలేదా . ఒక్కదానివే  వచ్చావేన్ది?  బస్ చార్జీలు  మిగులుతాయి అనా అని నన్ను అంటుంటే నాకు ఎంత సిగ్గేసింది. ఎప్పుడూ మీకేనా పట్టింపులు నాకూ వుంటాయి, అయినా  నాకు కొత్త చీర కూడాలేదు కట్టుకోవడానికి నేను రాను. "

"అమ్మా  ఇందాకే కదనే నేను షాప్ నుండి కొత్త చీర తెచ్చాను. అది కట్టుకో" అని చిన్నది గట్టిగా అరిచింది.

"హబ్బా హత  విధీ నిన్ను ఎవరు చెప్పమన్నారే? కాస్త నోరు మూసుకోలేవా? వెళ్ళు బయటికి."
"అమ్మ 4 రమువేల్దామే. ఇంతవరకూ కలిసి 4 రము ఎప్పుడూ వెళ్ళలేదు."

"అవును చిన్నీ. మీ తరపున ఫంక్షన్ ఐతే నేను కూడా వస్తాను. పిల్లలు చూడు ఎట్లా  చూస్తున్నారో"
"మిమ్మల్ని అస్సలే నమ్మను. ఎన్నోసార్లు ఇలాగే అన్నారు. పిల్లలకోసం అయితేనే nenu  ఒప్పుకుంటున్నాను." నా రోషం  అంతా దిగిపాయింది. పెద్ద బాగ్లు 2 సదిరాను. మూడు రోజులకి.

బస్ లో పక్క పక్క సీట్లు. విండో లు రెండూ పిల్లలకి. మధ్యలో మేము. ముందు సీట్లు. 3  ,4 ,5 ,6 . బస్ వెళ్తుంది. రోడ్డును గమనించడం నాకు చాలా ఇష్టం. డ్రైవింగ్ ను గమనిస్తుంటాను. ముందు సీట్ కోసం రిక్వెస్ట్ చేస్తాను ఎక్కువగా.

పిల్లలు ఒకరు ఐపాడ్ వింటూ , ఒకరు నాన్నతో ముచ్చట్లు. అలా అలా వెళ్తుంది బస్. నేను ఒకసారి కునుకు, ఒకసారి రోడ్డు ఇంకా  పిల్లలను గమనిస్తున్నాను.నిద్ర వస్తుంది.


పిల్లలు కూడా చిన్నగా నిద్రలోకి జారుకున్నారు. నాన్ స్టాప్ బస్. చాలా కాం గా  వుంది. హై వే. మధ్య మధ్య లో మాకు పెళ్లి నుండి ఫోన్ లు బయలుదేరారా? అని
నేను కూడా కళ్ళు తెరుస్తూ, మూస్తూ, రోడ్డును, డ్రైవింగ్ ను గమనిస్తూ ఉంటున్నాను. డ్రైవింగ్ ను గమనించడం నాకు ఇష్టం. అట్లా నేను కూడా నిద్రలోకి జారిపోయాను. డ్రైవర్  హరన్ కొట్టడం తో  మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి పిల్లలను చూసాను. నిద్రలో వున్నారు.

మావారిని చూసాను. అంతే ఒక్కసారే వణుకు వచ్చింది నాకు. నోట్లో నుండి మాట రావడం లేదు. అరుద్దామంటే గొంతు పెగలట్లేదు. మావారు ఎటో చూస్తున్నారు. ఆ చూపులో జీవం లేదు.  నాకు ఎందుకూ వాళ్ళు వణుకు తుంది  .
 నేను ఒక్కసారే ఆ సీట్ లోకి వెళ్లి ఆయనను తట్టి లేపాను. హబ్బ  చేయి ముట్టుకుంటే చల్లగా ఐస్ లాగ వుంది. "ఏమండీ ఏమండీ" అని గొంతు  గట్టి చేసుకొని అరిచాను ఒక 20 సార్లు  అన్నానేమో. అందరూ  లేచారు.

"ఏమండీ ఏమైంది" అని అడిగాను. మాట లేదు. కళ్ళు తేలేసారు. నా గుండె లో దడ మొదలైంది. డ్రైవర్ ను బస్ ఆపమని గాట్టిగాఅరిచాను. ఆపారు.
పిల్లలు లేచి ఒకటే ఏడుపు. "అమ్మ నాన్నకు ఏమైంది". అని. నాకే తెలవట్లేదు. వాళ్లకు ఏమని చెప్పను. నాకు ఏడుపు ఆగడం లేదు.
"డాక్టర్ ఎవరైనా వున్నారా? బస్  లో" అని అడిగాను. ఎవరూ లేనట్టుంది. ఎవరూ రాలేదు. నేను తెచ్చుకున్న  బాటిల్ లో నుండి నీళ్ళు చల్లాను. లేవట్లేదు. అందరూ నన్ను ఓదారుస్తున్నారు. ఏమీ కాదమ్మా అని.  నా ప్రయత్నం నేను చేస్తున్నాను. పల్స్ చూసాను.

నాకేం తెలవట్లేదు. మళ్ళీ మళ్ళీ తట్టి లేపాను. లేవట్లేదు. దేవుడా ఈయనకు ఏమైంది. గుండెమీద గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. చేస్తున్నాను. ఏడుపు  వస్తుంది పెద్దగా ఏడుస్తూనే మళ్ళీ పల్స్ చెక్ చేసాను. "ఏమండీ ఏమండీ లేవండీ"  అంటూ.ఒక్కసారే   పల్స్ రన్ అవుతుంది అనిపించింది.  మళ్ళీ chest మీద ప్రెస్ చేసాను.

ఒక్కసారే కళ్ళు తెరిచారు. మళ్ళీ ప్రెస్ చేసాను కాస్త నెమ్మదిగా . అప్పుడు కళ్ళు తెరిచారు పూర్తిగా. భగవంతుడా నీకు వేల వేల దండాలు స్వామీ.
"ఏంటి చిన్నీ నాకేమైంది. అంటున్నారు."  నేనేం చెప్పే స్థితి లో లేను. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. నేనేం చెప్పలేదు.  సంతోషం  తో కూడా మాటలు రావని తెలుస్తుంది. " ఏమ్లేదమ్మ స్పృహ కోల్పోయారు ఏం భయం లేదులే  ఇక" అని  అంటున్నారు.   ఆయన లేచారు చాలు. నెమ్మదిగా అందరూ వారి వారి సీట్లలో కూర్చున్నారు.

మమ్మల్ని మా వారు దగ్గరికి తీసుకున్నారు. నేను లేచాను నా సీట్లో కి వెళ్లాను.  పిల్లలు తండ్రి కి అటు ఇటు కూర్చున్నారు.  ఒక 15   నిమిషాలకు మామూలు స్థితి కి వచ్చాము.
ఎందుకో మరి స్పృహ తప్పారు. తర్వాత వచ్చే స్టాప్ లో బస్ ను ఆపించాను. అందరికీ  చేతులు జోడింఛి  థాంక్స్ చెప్పి బస్ దిగాము. అందరు కూడా "ఏం కంగారు పడకండి డాక్టర్ కి చూపించుకొని రండి." అంటూ ధైర్యం చెప్పారు. అది ఏ ఊరో నాకు తెలవదు.

నేను ఒక పండ్ల  బండి దగ్గర  మావారిని కూర్చొమ్మని,  బి.పి. చూపించు కోవడానికి క్లినిక్ ను వెదుకుతున్నాను. ఒక  షాప్ లో కనపడింది. బాగ్స్  పట్టుకొని అక్కడికి వెళ్ళాము. బి.పి. చెక్ చేయించాను. హమ్మయ్య  నార్మల్ గా వుంది. కానీ డాక్టర్ గారు  లేరు. నేను ఒక ఆటో మాట్లాడి. అతనిని డాక్టర్ వున్న  క్లినిక్  దగ్గరికి తీసుకు వెళ్ళమని చెప్పాను. . govt .hosp . కి తీసుకెళ్ళాడు. అక్కడ కూడా డాక్టర్ గారు లేరు.

  అప్పుడు రాత్రి 1 ౦.౦౦ గంటలు అవుతుంది. ఒక  R .M P డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు. అతను చూసి tablets ఇచ్చి కొంచం సేపు కూర్చోమ్మన్నారు. ఎసిడిటీ అని అన్నారు.  ఆటో అతనిని  మళ్ళీ బస్ స్టాప్ లో దిన్చమన్నాము.అతను అడిగిన దాని కంటే ఎక్కువ ఇచ్చి థాంక్స్ చెప్పాము అందరమూ.

పిల్లలను చూస్తుంటే నాకు బాధేసింది. చిన్న చిన్న చేతులు. ఒక బాగ్ వారికే ఇచ్చాను. ఇద్దరూ కలిసి పట్టుకున్నారు. అప్పుడు రాత్రి 11. 00 అవుతుంది. మేము బస్ కోసం  వైట్ చేస్తున్నాము.  దాదాపు అర గంట ఐంది.  ఇంతలో ఒక కారు మా పక్కన ఆగింది. ఎవరో తెలవదు.
"ఏమండీ ఎక్కడికి వెళ్ళాలి" అన్నారు." హైదరాబాదు ". అని చెప్పాము.  "నేను  అటే వెళ్తున్నాను వస్తారా?" అన్నారు.

ఎందుకండీ బస్ వస్తుంది మేము వెళ్తాము  అన్నాము. ఫరవాలేదు రండి. నేను ఒక్కడినే కదా వస్తారని అడిగాను. నేను మావారు ఆలోచించుకొని వెళ్తే మంచిది అనుకున్నాము.


ఓహ్ గాడ్. ఇతనిని నీవే పంపించావు స్వామీ అనుకున్నాను. సరే అని ఎక్కాము. ఇంకా ఎవరో అడిగారు. వారిని ఎక్కిన్చుకోలేదు. "పేషెంట్ వున్నారు." అని చెప్పారు. అరె! ఇతనికి ఎలా తెలుసు అనుకున్నాను." ఏమండీ  పేషంట్ అని మీకు ఎలా తెలుసు" అన్నాను. "మిమ్మల్ని బస్ దిగిన దగ్గరి నుండి గమనిస్తూ మీ కోసం వైట్   చేస్తున్నాను. మీరు ఈ వూరి వారు కాదు  అనుకొని  ఇక్కడే  ఆగాను. ఏదైనా  హెల్ప్  చేద్దామని . అని అన్నారు. దేవుడా  నీకు వేల వేల దండాలు.
"ఎక్కడ దిగాలి?" అన్నారు." మేము పెళ్ళికి వెళ్తున్నాము. ఎల్.బి.నగర్ లో పెళ్లి. మీరు స్టాప్ దగ్గర ఆపండి.మేము ఆటోలో వెళ్తాము"  అన్నాము. "సరే" అన్నారు. పిల్లలు అలసి పోయారేమో నిద్ర లోకి వెళ్ళారు. మా వారిని కూడా పడుకోమ్మన్నాను. నాకేమో దడ ఇంకా చిన్నగా అలాగే  వుంది. కళ్ళ నుండి నీళ్ళు ఆగట్లేదు. మా వారు కూడా నన్ను  దగ్గరికి తీసుకొని. ఊరుకో అంటున్నారు.

అక్కడికి చేరాక డబ్బులు ఇవ్వబోయాము. అతను వద్దన్నాడు. నేను కిరాయి కి మిమ్మల్ని తేలేదు. నాకు డబ్బులు వద్దు అన్నారు. అందరం చాలా  చాలా థాంక్స్ అని చెప్పాము. పిల్లల తో చెప్పించాము నిద్ర లేపి. ఆటోలో పెళ్ళికి వెళ్ళాము. ముందే మొఖం కడుకున్నాము.  సో.. మా విచారాన్ని బయట పడ నివ్వలేదు. పిల్లల ను కూడా ఎవరికీ చెప్పొద్దూ అని చెప్పాము. ఎన్నో ఫోన్ లు  బస్ లేట్ గ బయలు దేరింది అని  ఎన్నో అబద్దాలు ఆడాను.  ఫోన్ లో ఈ విషయం చెప్పొద్దని.
ఫంక్షన్ హాల్ కి వెళ్ళాము. అందరూ రిసీవ్ చేసుకున్నారు. పెళ్లి అప్పటికి జరిగిపాయింది. ఏంటి లేట్ అని అడుగుతున్నారు . పెళ్లి ఇంట్లో చెప్పడం ఇష్టం లేదు. ఎవ్వరికి కూడా  చెప్పలేదు.  నల్గురం కూడా బట్టలు చేంజ్ చేసుకోలేదు. కొంత సేపు అయ్యాక  నా మనసు నెమ్మదించింది.


మీకు తెలుసా నేను అంత రాత్రి  పెళ్లి అని పట్టు చీర కట్టుకోకుండా ముందు  చెప్పిన  క్రీం కలర్ కట్టుకున్నాను. ఇక చీర మార్చుకోలేదు.  అదే చీరతో వున్నాను. ఆ చీర ను చూసిన వారంతా చాల బాగుంది అన్నారు. ఆ చీరకు ఎన్ని కాంప్లిమెంట్స్ అంటే  చెప్పలేను. నవ్వి ఊరుకున్నాను. ఎంజాయ్ చేసినట్టు చేసాను. ఈ చీర ఎంతకు కొన్నావు.  నాకు కూడా కొనివ్వు. డబ్బులు ఇస్తాము అంటూ ఒకటే తొందర చేసారు. . పెళ్లి  తర్వాత  ఎవరం ఎక్కడో కదా. ఇక ఆరాత్రి మా అక్క వాళ్ళింటికి వెళ్లి పడుకొని పొద్దున్నే టిఫిన్ చేసి మళ్ళీ  మా వూరికి చేరాము.

ఈ సందర్భం తలచుకున్న కొద్ది నాకు భయం ఆగదు. అది గుర్తుకు వస్తే పిల్లలు, నేను వేరే పనులు చేసుకుంటాము వెంటనే.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.